Monday, 16 August 2021

సునీల్‌తో పాటు భయంకరమైన విలన్లు.. యాక్షన్‌కు ఆది సాయి కుమార్ రెడీ!!

ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. వరుసబెట్టి సినిమాలను లైన్‌లో పెట్టేశారు. ఇది వరకే వదిలిన బ్లాక్ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా మరో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఆదివారం జరిగిన పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీస్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు హీరో ఆది సాయికుమార్‌. ఇప్పుడు ఆది క‌థానాయ‌కుడిగా నాట‌కం ఫేమ్ క‌ళ్యాణ్ జి.గోగ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. విజ‌న్ సినిమా బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం(ఆగ‌స్ట్ 15) రోజున టి.ఎం.కె() అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మై పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రం కోసం ఆది సాయికుమార్ స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల్‌రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌, మ‌ణికాంత్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సునీల్‌ అదిరిపోయే పాత్రలో కనిపించబోతోన్నారు. ఇక వసుంధర పాత్రలో పూర్ణ‌, తల్వార్ క్యారెక్టర్‌లో క‌బీర్ దుహాన్ సింగ్, థాకూర్ అనూప్ సింగ్ వంటి భయంకరమైన విలన్లు నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m5omdg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...