Monday, 16 August 2021

శ్రీహరి తనయుడు లేటెస్ట్ సినిమా.. స్పెషల్ రోజున పోస్టర్ విడుదల చేసిన యూనిట్

పాత్ర మంచిదైతే దానిలో పరకాయ ప్రవేశం చేయడానికి వెనుకాడని నటుడు . విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కానీ, కమెడియన్‌గా కానీ ఇలా ఎలాంటి పాత్ర అయినా.. ఆయన ఆ పాత్రలో లీనమై నటిస్తారు. అయితే మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో ఆయన చనిపోవడం సినీ పరిశ్రమకు తీరని లోటుగా మిగిలిపోయింది. ఎంతో మంది ప్రముఖలు, ఆయన మంచితనం గురించి.. ఔనత్యం గురించి చాలా సందర్భంలో చాలా మంది సెలబ్రిటీలు గుర్తు చేసుకున్నారు. ఇక శ్రీహరి తనయుడు మేఘాంష్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలం క్రితం మేఘాంశ్ ‘’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా అంతగా ఆడలేదు .. అయితే తన నటనకు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘కోతి కొమ్మచ్చి’ సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమా ఇంకా షూటింగు దశలోనే ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అయితే తాజాగా మరో సినిమాను మేఘాంష్ ఓకే చేశారు. తాజాగా ఆయన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకి 'రాసిపెట్టుంటే' అనే టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నందు మల్లెల దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37N07bC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...