సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన వేసే ట్వీట్లు, చేసే కామెంట్లు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఆయన ఎక్కువగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన విషయాలనే పోస్ట్ చేస్తుంటారు. పవన్ కళ్యాణ్‌కు కొత్త పేరు పెడుతూ.. దేవర అంటూ ఎప్పుడూ కీర్తిస్తుంటూనే ఉన్నారు. ఇక కొందరు దాన్ని భజన అని అంటే.. కాదు భక్తి అని మరొ కొందరు సమర్థిస్తుంటారు. ఎన్నో వేదికల మీద బండ్ల గణేష్ ప్రత్యక్షంగానే కొన్ని విషయాలను చెప్పేశారు. తాను భక్తుడు అని సగర్వంగా చెప్పుకుంటాను అని బండ్ల గణేష్ ప్రకటించేశారు. అలా పవన్ కళ్యాణ్ మీద తన ప్రేమను సమయం సందర్భంగా లేకపోయినా ప్రకటిస్తుంటారు. ఇక పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేష్‌ను ప్రత్యేకంగా చూస్తారు. బండ్లన్న వేసే ట్వీట్లను పవన్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేసేస్తుంటారు. అయితే పవన్ కళ్యాణ్‌పై ఎక్కువగా ట్వీట్లు వేసే బండ్ల గణేష్ అప్పుడప్పుడు మీద కూడా ఫోకస్ పెడుతుంటారు. చిరంజీవి గురించి బండ్ల గణేష్ మాట్లాడితే ఎలా ఉంటుందో ఇది వరకే ఎన్నో సార్లు చూశాం. తాజాగా మరోసారి బండ్ల గణేష్ తన మెగా ప్రేమను బయటపెట్టేశారు. తాజాగా చిరంజీవి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ కాసాగాయి. వాటిపై బండ్ల గణేష్ స్పందించారు. ‘మా దేవర కి అన్న అందరికీ నేను అనే నమ్మకం మనిషి అంటే ఇలా ఉండాలి అని ప్రజలకు చెప్పిన మహోన్నత వ్యక్తి మా పెద్దన్న’ అంటూ చేతులెత్తి దండం పెడుతున్న ఎమోజీలను షేర్ చేశారు. ప్రస్తుతం చిరు మీద వేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fMjVQz
v
No comments:
Post a Comment