Monday, 16 August 2021

‘ఇలా చేయండి’.. అల్లు అర్జున్ సాంగ్‌పై అభిమానులకు ఆఫర్ ఇచ్చిన ‘పుష్ప’ యూనిట్

అల్లు అర్జున్, కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘’. ఎర్ర చందనం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ‘దాక్కో దాక్కో మేక’ అనే పాట విడుదల చేశారు మేకర్స్. విడుదలైన కొంత సమయంలోనే ఈ పాట సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఐదు భాషల్లో ఈ సాంగ్ రిలీజ్ చేశారు. తెలుగులో శివం, హిందీలో విశాల్‌ దడ్లాని, కన్నడంలో విజయ ప్రకాష్‌, తమిళంలో బెన్నీ దయాల్‌, మలయాళంలో రాహుల్‌ నంబియార్‌ పాటని ఆలపించారు. అయితే గతంలో విడుదలై ఈ సినిమా టీజర్లు, ఫస్ట్‌లుక్ పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను అమితంగా అలరించింది. అందులో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. చివర్లో అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఇక తాజాగా విడుదలైన తొలి సింగిల్ కూడా ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం అందిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా యూనిట్ ప్రేక్షకులకు మరో ఆఫర్ ఇచ్చింది. తొలి సింగిల్‌లోని ‘ఆహ్.. ఆహ్..’ అంటూ సాగే బిట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయాలి అంటూ చిత్ర్ యూనిట్ అధికారికంగా ట్వీట్ చేసింది. ఇక ఈ సినిమా క్యాస్టింగ్ విషయానికొస్తే.. హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XvISK1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...