Monday, 16 August 2021

మడత మంచం అంటే చాలా ఇష్టం! ఆ సమయంలో మిగిలింది అదొక్కటే.. అన్నీ చూపించిన మంచు లక్ష్మి

యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో నడిపిస్తున్న హవానే వేరు. ట్రోల్స్ లాంటివి ఎన్ని ఎదురైనా తన యాక్టివ్‌నెస్ ఏ మాత్రం తగ్గించకుండా దూసుకెళ్తోంది మంచువారమ్మాయి. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ అప్‌డేట్స్ ఇస్తూనే కూతురు విద్యా నిర్వాణకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా రీసెంట్‌గా తన పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మంచు లక్ష్మి.. తొలి వీడియోతోనే అట్రాక్ట్ చేసింది. తనను హోమ్ టూర్ (మీ ఇల్లు చూపించండి) అని చాలా మంది అడిగారని తెలుపుతూ గత వారంలో హోమ్ టూర్ ప్రోమో వీడియో రిలీజ్ చేసి అట్రాక్ట్ చేసింది. జిగేల్ అనిపించేలా ఉన్న తన ఇంటి పరిసరాలు చూపించి ఫుల్ వీడియోపై కుతూహలాన్ని పెంచేసింది. ఇక ఇప్పుడు హోమ్ టూర్ ఫుల్ వీడియో వదిలిన మంచు లక్ష్మి.. తన ఇంటి వివరాలు తెలుపుతూ ఒక్కో గదిని తిరిగి చూపించింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ ఇంటిలోకి సుమారు ఆరేళ్ల క్రితం వచ్చానని, తన అభిరుచికి తగ్గట్టు ఇంటిలో ఎన్నో మార్పులు చేసుకున్నానని తెలిపింది. తనకు పెయింటింగ్స్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన మంచువారమ్మాయి.. ఇంట్లో ఉన్న పెయింటింగ్స్‌ అన్నింటినీ చూపిస్తూ వాటి గురించి వివరణ ఇచ్చింది. యూఎస్‌లో తన ఇల్లు కాలిపోయినప్పుడు కేవలం ఒక పెయింటింగ్ మాత్రమే మిగిలిందని.. అదంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. బెడ్ రూమ్‌లో ఉన్న మడత మంచాన్ని చూపిస్తూ ఇది కూడా ఎంతో ఇష్టమని తెలిపింది. అలాగే ఇంటిలోని టీ కలెక్షన్స్‌, ఫొటో కలెక్షన్స్, జ్యువెలరీ కలెక్షన్స్, షూ కలెక్షన్స్‌ ఇలా తనకిష్టమైన ఎన్నో విషయాల గురించి మంచు లక్ష్మి ఈ వీడియో ద్వారా బయటపెట్టింది. ఈ ఫుల్ వీడియో చూసి మంచువారమ్మాయి ఇల్లు జిగేల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. యూట్యూబ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37KvOSP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...