Monday, 16 August 2021

కియారా మాత్రమే కాదు.. శంకర్-చరణ్ కాంబోలో మరో హీరోయిన్.. అదీ పవర్‌‌ఫుల్ పాత్రలో..

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ఎవరు అంటే ముందుగా అందరూ పేరు చెబుతారు. ‘రంగస్థలం’ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఇంకో లెవల్‌కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన స్వాతంత్య్ర పోరాట యోధులు అల్లురి సీతరామరాజు పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ దసరా పండుగ సమయానికి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక రామచరణ్ చేస్తున్న మరో సినిమా ‘ఆచార్య’. ఇది మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూనే ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలతో పాటు చరణ్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. అదే సెన్సేషనల్ దర్శకుడు దర్శకత్వంలో. పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా కాలం అయింది. తాజా ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తుందంటూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. దర్శకుడు శంకర్‌తో కలిసి కియారా ఉన్న పిక్‌ని కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కియారాతో పాటు మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ కూడా నటిస్తోందట. అయితే అది ఎవరు అనే విషయాన్ని ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు. కానీ ఓ పవర్‌ఫుల్ పాత్రలో ఓ బాలీవుడ్ సీనియర్ హీరోయిన నటిస్తోందని టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక సమాచారాం వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xPHv5k
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...