Wednesday, 4 August 2021

మహేష్ బాబు బర్త్ డే.. గుర్తుపెట్టుకోండి అదో చరిత్ర అవుతుంది.. తమన్ సెన్సేషనల్ ట్వీట్

సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఫస్ట్ నోటీస్ అంటూ నుంచి ఫస్ట్ లుక్ వదిలారు. ఇక మహేష్ బాబు బర్త్ డే (ఆగస్ట్ 9)న అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. దీని గురించి ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అంచనాలను పెంచేశారు. అయితే తాజాగా వేసిన ట్వీట్ మాత్రం సంచలనంగా మారింది. గుర్తు పెట్టుకోండి.. అది చరిత్ర కాబోతోందంటూ బిజినెస్ మెన్ సినిమాలో మహేష్ బాబులా ఎంతో ఇంటెన్సిటీతో చెప్పినట్టు కనిపిస్తున్నారు. సర్కారు వారి పాట ఆల్బమ్ మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. గత ఏడాది టైటిల్ పోస్టర్ వదిలిన సమయంలోనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వైరల్ అయింది. అదే సమయంలో కాస్త నెగెటివిటీ కూడా ఎదురైంది. సౌండ్ ఎక్కువైంది పదాలు కూడా వినిపించడం లేదంటూ ట్రోలింగ్ వచ్చింది. అయితే సర్కారు వారి పాట కోసం తమన్ అదిరిపోయే బాణీలను రెడీ చేసినట్టు తెలుస్తోంది. మహేష బాబు బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్‌ను వదలబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తమన్ వేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. మన సూపర్ స్టార్ మరింత వెలిగే సమయం ఆసన్నమైంది.. మరింత పెద్దగా వెలగబోతోన్నారు.. ఆగస్ట్ 9ని మార్క్ చేసుకోండి.. అది ఓ కొత్త చరిత్రగా మారబోతోంది. ఇక ఇప్పటి నుంచి అగ్గి రాజేసేయండి..సెలెబ్రేషన్స్ మొదలుపెట్టేద్దామంటూ తమన్ రచ్చచేస్తున్నారు. ఇలా తమన్ ముందు నుంచే మహేష్ బాబు అభిమానుల్లో జోష్ నింపేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు. మైత్రీ, జీఎంబీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AbLEly
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...