Wednesday, 4 August 2021

అలాంటి పోస్ట్‌లు ఎందుకు పెడతావ్?.. తరుణ్ భాస్కర్‌ను ప్రశ్నించిన మంచు లక్ష్మీ

ఇప్పుడు ఆహా కోసం కొత్త అవతారాన్ని ఎత్తిన సంగతి తెలిసిందే. ఆహా భోజనంటూ అంటూ వంటల ప్రోగ్రాంతో అదరగొడుతున్నారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్‌లు సక్సెస్ ఫుల్‌గా పూర్తయ్యాయి. ఇందులో మొదటి గెస్టుగా విశ్వక్ సేన్, రెండో అతిథిగా రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి సందడి చేశారు. అతిథులుగా వచ్చిన వారు కేవలం వంటలు వండటమే కాకుండా తమ పర్సనల్ విషయాలు, వ్యక్తిగత ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ ఉంటారు. అలా విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్‌లతో మంచు లక్ష్మీ ఫుల్ సందడి చేశారు. ఇక ఇప్పుడు ఈ వరుసలో చేరడానికి వచ్చేశారు. మూడో ఎపిసోడ్ కూడా తరుణ్ భాస్కర్‌ను దించారు. ఇక మంచు లక్ష్మీ తరుణ్ భాస్కర్ కలిసి వంట ప్రోగ్రాంను కాస్తా కామెడీ ప్రోగ్రాంగా మార్చేశారు. వరుస పంచ్‌లు, కౌంటర్లతో షో ముందుకు సాగినట్టు కనిపిస్తోంది. తాజాగా వదిలిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇన్ స్టాలో వంట చేస్తున్నట్టుగా.. కేవలం సామాగ్రి ఉన్న ఫోటోలను మాత్రమే ఎందుకు పోస్ట్ చేస్తావ్ అని తరుణ్ భాస్కర్‌ను మంచు లక్ష్మీ అడిగేశారు. వంట వండిన తరువాత పోస్ట్ చేస్తే ఇలా ఉందేంటి? అని ఎవరైనా కౌంటర్లు వేస్తారో ఏమోనని పోస్ట్ చేయనంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ షోలో తరుణ్ భాస్కర్ చెక్కర పొంగలి చేసినట్టు కనిపిస్తోంది. రసం కూడా ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ రెండు వంటకాలు కాస్త తేడా కొట్టినట్టే కనిపిస్తోంది. ఇంతకీ తరుణ్ భాస్కర్ ఎలా చేశాడో తెలియాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే. ఆగస్ట్ 6న ఈ ఎపిసోడ్ అందుబాటులోకి రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fyBymX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...