Wednesday, 4 August 2021

ప్రియాంక చోప్రా ఎదపై సేద తీరుతున్న నిక్! అదే ఆయనకు ఇష్టం.. గ్లోబల్ బ్యూటీ రొమాంటిక్ మూమెంట్ వైరల్

రొమాంటిక్ ముచ్చట్లకు నిత్యం వార్తల్లో ఎక్కడో చోట ఓ స్పేస్ ఉండటమనేది కామన్. ఏ మాత్రం మొహమాటం లేకుండా తన రొమాంటిక్ సంగతులను, ముద్దు ముచ్చటను అందరి ముందుంచడం ప్రియాంక హ్యాబీ. తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ని లవ్వాడి పెళ్లి చేసుకున్న గ్లోబల్ బ్యూటీ.. ఆయనతో చేసే రొమాన్స్ పబ్లిక్ చేస్తుంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు కెమెరా ముందు విరహవేదన తీర్చుకున్నారు ప్రియాంక దంపతులు. వీలు కుదిరినప్పుడల్లా పబ్లిక్ ప్లేసెస్ చుట్టేస్తూ భర్త నిక్ జోనాస్‌తో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటుంది ప్రియాంక చోప్రా. పెళ్లి ముందు నుంచే ఆయనతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ తమ ప్రేమ వ్యవహారాలు బయటపెట్టి హాట్ టాపిక్ అయి జనం నోళ్ళలో నానింది. ఆ తర్వాత అతన్నే పెళ్లి చేసుకొని అదే కంటిన్యూ చేస్తూ పబ్లిక్ రొమాన్స్ చేసింది. ఏ పబ్లిక్ ఈవెంట్ అయినా, విహార యాత్ర అయినా ప్రియాంక- నిక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యేలా ఉంటోంది వాళ్ళ వ్యవహార శైలి. మరోవైపు సోషల్ మీడియా లోనూ యాక్టివ్ రోల్ పోషిస్తున్న ప్రియాంక.. ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో పాటు రొమాంటిక్ మూమెంట్స్ షేర్ చేస్తూ భర్తపై ప్రేమను చాటుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన భర్త నిక్‌తో దిగిన రొమాంటిక్ ఫొటోను సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి షాకిచ్చింది ప్రియాంక చోప్రా. ఇందులో ఆమె తన భర్త నిక్ జోనస్‌ను ఎద భాగంలో హత్తుకుని కనిపించింది. ఈ రొమాంటిక్ ఫొటోకు తోడుగా 'అతడు తనకిష్టమైన ప్రదేశంలో ఉన్నాడు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చి భర్తపై ప్రేమ కురిపించింది. ఇలా తన హృదయంలో భర్తకు పదిలమైన చోటు ఉందంటూ పరోక్షంగా చెప్పింది. దీంతో ఈ పిక్‌ నెట్టింట వైరల్ కావడంతో పాటు నెటిజన్ల నుంచి భారీ స్పందన తెచ్చుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fvjES8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...