Wednesday, 4 August 2021

ఓ వైపు సినిమా మరో వైపు బిగ్ బాస్.. రంగంలోకి దిగిన కింగ్ నాగ్

కింగ్ ప్రస్తుతం ఫుల్ బిజీ కాబోతోన్నారు. గత ఏడాది మాదిరిగానే ఒకేసారి తన సినిమా షూటింగ్, షూటింగ్‌లను మొదలుపెట్టేశారు. గత ఏడాది వైల్డ్ డాగ్, బిగ్ బాస్ నాల్గో సీజన్ ఒకేసారి పట్టాలెక్కించారు. అయితే ఈ సారి కూడా అదే స్ట్రాటజీని నాగార్జున ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కాకముందు ఫస్ట్ షెడ్యూల్‌ను నాగార్జున పూర్తి చేసేశారు. ఇక సెకండ్ వేవ్ ఉధృతంగా రావడంతో షూటింగ్ వాయిదా పడింది. అయితే ఇన్ని రోజుల తరువాత మళ్లీ నాగార్జున ఇంటి నుంచి బయటకు వచ్చారు. వచ్చీ రావడంతోనే ఇలా రెండింటిని లైన్‌లో పెట్టేశారు. ఇది వరకే బిగ్ బాస్‌కు సంబంధించిన ప్రోమోను కూడా షూట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ గన్ పట్టుకుని పోజు ఇచ్చినట్టుగా ఉన్న ఓ స్టిల్ బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు సినిమా సెట్‌లో అడుగు పెట్టినట్టు కనిపిస్తోంది. మొత్తానికి చాలా రోజులు తరువాత ఇలా నాగార్జున సెట్స్ మీదకు వచ్చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ మూవీని నారాయణ్ దాస్ నారంగ్, రామ్ మోహన్ రావ్, శరత్ మరార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నట్టు కనిపిస్తున్నాయి. ప్రవీణ్ సత్తారు ఇది వరకు గుంటూరు టాకీస్, గరుడ వేగ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ypVhNa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...