Thursday, 5 August 2021

దర్శకుడితో అలా పరిచయం.. ‘మెరిసే మెరిసే’పై వివి వినాయక్ కామెంట్స్

స్టార్ డైరెక్టర్ చాలా రోజుల తరువాత కెమెరా ముందుకు వచ్చారు. హుషారు ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా '' సినిమా ప్రమోషన్స్‌లో వినాయక్ కనిపించారు. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై . దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మెరిసే మెరిసే' చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా రేపు (ఆగస్టు 6) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ అభినందించారు. ఈ సంద‌ర్భంగా వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ.. డైరెక్ట‌ర్ ప‌వ‌న్ రాజ‌మండ్రి కుర్రాడు. మా నాన్న‌గారి స్నేహితుడు సుబ్బ‌రాజుగారి అబ్బాయి అయిన ప‌వ‌న్ `మెరిసే మెరిసే` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతుండ‌టం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి ప‌వ‌న్‌కు చాలా మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను. అలాగే హుషారు చిత్రంలో న‌టించిన దినేశ్ హీరోగా న‌టించాడు. ఈ సినిమాకు ప‌నిచేసిన యూనిట్‌లో చాలా మంది రీసెంట్ సినిమాల్లో ప‌నిచేసిన‌వారే. ఓ మంచి టీమ్ చేసిన ఈ ప్ర‌య‌త్నం డెఫ‌నెట్‌గా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను..ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అని అన్నారు. ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ కె మాట్లాడుతూ.. సినిమా ఆగ‌స్ట్ 6న విడుద‌ల‌వుతుంది. సినిమా ట్రైల‌ర్ చూసి మా టీమ్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేసిన స్టార్ డైరెక్ట‌ర్ వినాయ‌క్‌ పెద్ద మ‌న‌సుకు ధ‌న్య‌వాదాలు. మంచి ప్ర‌య‌త్నం చేశాం. యుక్త‌వ‌య‌సులోని అమ్మాయి, అబ్బాయిల మ‌న‌సులు సునిశితంగా ఉంటాయి. అలాంటివారు క‌లిసి చేసే ప్ర‌యాణంలో ఎలాంటి ఒడిదొడుకుల‌ను ఎదుర్కొన్నారు..ఎలా స‌క్సెస్ అయ్యార‌నే క‌థాంశంతో ఈ సినిమా రూపొందింది. క‌చ్చితంగా అందిర‌కీ ఈ సినిమా న‌చ్చుతుంది. మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని భావిస్తున్నామని అన్నారు. హీరో మాట్లాడుతూ.. కోవిడ్ స‌మ‌యంలో చాలా స్ట్ర‌గుల్స్ ఫేస్ చేసి సినిమాను విడుద‌ల చేస్తున్నాం. ఇండ‌స్ట్రీ నుంచి చ‌క్క‌టి మ‌ద్ద‌తు ల‌భించింది. వినాయ‌క్ వంటి పెద్ద డైరెక్ట‌ర్ మా యూనిట్‌ను అభినందించ‌డ‌మే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌. మెరిసే మెరిసే చ‌క్క‌టి మూవీ. ప్లెజంట్ గా ఉంటుంది. థియేటర్‌లో చూసి ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నామని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lwpgiT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...