Thursday, 5 August 2021

Vishal 31 ఇక విధ్వంసమే.. రంగంలోకి దూకిన విశాల్!

కోలీవుట్, టాలీవుడ్‌లో సరి సమానమైన మార్కెట్‌ ఉన్న హీరోల్లో ఒకరు. ఇప్పుడు ఈ యాక్షన్ హీరో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. చివరగా చక్ర అంటూ అందరినీ పలకరించారు. ఇక ఎనిమీ అంటూ ఆర్య, విశాల్‌లు రాబోతోన్నారు. ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే వదిలిన టీజర్లు,పోస్టర్లు అదిరిపోయాయి. ఇక విశాల్ తదుపరి సినిమాకు సంబంధించిన అప్డేట ఇప్పుడు వచ్చింది. విశాల్ కెరీర్‌లో 31వ సినిమాగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. `ఈదు థెవైయో అధువే ధర్మం` అనే షార్ట్ ఫిల్మ్ తో మంచి టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విశాల్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ సినిమాను విశాల్ నిర్మిస్తున్నారు. తన కెరీర్‌లో 31వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని విశాల్‌ ఫిలిం ఫ్యాక్ట‌రి బేన‌ర్‌పై విశాల్ నిర్మిస్తున్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడ్డ షూటింగ్ ఇప్పుడు మళ్లీ తిరిగి ప్రారంభమైంది. ఇదే చివరి షెడ్యూల్. ఆగస్ట్ నెలలోనే షూటింగ్ మొత్తం పూర్తి కాబోతోంది. ఇక షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్లు ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు. న‌డుస్తున్న జ‌న‌సందోహం నుండి విశాల్ ఫేస్‌ని చూపించారు. దానితో పాటు నాట్ ఎ కామ‌న్ మ్యాన్ (#NotACommonMan) అనే హ్యాష్ టాగ్‌ను జోడించారు. ఈ మూవీకి యంగ్ మ్యాస్టో యువ‌న్‌శంక‌ర్‌రాజా సంగీతం అందిస్తుండ‌గా బాల‌సుబ్ర‌మ‌ణ్యం సినిమాటోగ్ర‌పి భాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఎస్ ఎస్ మూర్తి ఆర్ట్ డైరెక్ట‌ర్‌, ఎన్ బి శ్రీ‌కాంత్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. మొత్తానికి ఈ మూవీ కూడా విశాల్ మార్క్ చూపించేలా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X23GbX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...