Thursday, 5 August 2021

నిహారిక భర్త చైతన్య పోలీస్ కేసు.. మద్యం సేవిస్తూ రచ్చరచ్చ! ఇదీ మెగా అల్లుడి రియాక్షన్

మెగా బ్రదర్ నాగబాబు అల్లుడు, జొన్నలగడ్డ చైతన్యపై పోలీస్ కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. అర్ధరాత్రి వేళ తన స్నేహితులతో మద్యం సేవించి రచ్చ చేస్తున్నట్లు పేర్కొంటూ అపార్ట్‌మెంట్ వాసులు పోలీస్ కేసు పెట్టారు. దీనిపై చైతన్య కూడా పోలీసుల వద్ద తన ఫిర్యాదు నమోదు చేశాడు. దీంతో ఒక్కసారిగా ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఫిలిం నగర్‌లో ఎక్కడ చూసినా ఈ ఇష్యూ గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చైతన్య రియాక్ట్ అవుతూ ఓ క్లారిటీ ఇచ్చారు. అపార్ట్‌మెంట్‌ వాసులు గొడవ చేయడం వల్లే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపిన చైతన్య.. అందరం మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నామని, కాంప్రమైజ్ అయ్యామని అన్నారు. షేక్ పేటలోని Tancica అపార్ట్మెంట్ యొక్క ఫ్లాట్ అద్దెకు తీసుకున్నామని, ఇందులో 25 నుంచి 30 కుటుంబాలు ఉంటున్నాయని చెప్పారు. అయితే ఇది అద్దెకు తీసుకునే ముందే ఆఫీస్‌ పర్పస్‌ కోసమని ఓనర్‌కి చెప్పామని ఆయన తెలిపారు. అయితే అపార్ట్‌మెంట్‌ అసోసియయేషన్‌కు సరైన క్లారిటీ లేకపోవడంతో వాదనకు దిగారని చైతన్య అన్నారు. కమర్షియల్ ఆఫీస్‌గా ప్లాన్ చేయడంతో మిగితా ఫ్లాట్స్ వాళ్లకు ఇబ్బందికరంగా ఉందంటూ వచ్చి గొడవ లాగా చేశారని, దీంతో ఒకరిపై ఒకరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నామని చెప్పారు. ఆగస్టు 10వ తేదీన తాను అద్దెకు తీసుకున్న ఆ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ ఖాళీ చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని అపార్ట్‌మెంట్‌ ఓనర్‌కు కూడా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. చైతన్య అర్ధరాత్రి పూట గొడవ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అపార్ట్‌మెంట్‌ వాసులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దానికి రిటర్న్ కౌంటర్‌గా చైతన్య మరో ఫిర్యాదు అందించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తుండగా, ఇరువురు ఫిర్యాదు దారులు రాజీకి వచ్చినట్లు సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TTVLMo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...