Thursday, 5 August 2021

తాప్సీ ‘మిషన్ ఇంపాజిబుల్‌’లో మలయాళీ నటుడు.. అధికార ప్రకటన చేసిన చిత్ర యూనిట్

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పంజాబీ ముద్దుగుమ్మ . ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తాప్సీ.. ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాష సినిమాలతో బిజీ అయింది. అయితే కొంతకాలం తర్వాత తెలుగులో సరైన సక్సెస్‌ రాకపోవడంతో ఆమె బాలీవుడ్‌కే పరిమితమైంది. అక్కడే సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంది. రీసెంట్‌గా హసీనా దిల్రుబా’ అనే సినిమాతో మంచి సక్సెస్‌‌ని అందుకుంది తాప్సీ. ఓటీటీలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకలను అలరించడమే కాదు.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా తాను సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన తాప్సీ. ‘ఔట్‌సైడర్స్ ఫిలిమ్స్‌’ అనే పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభిస్తున్నట్లు తాప్సీ ప్రకటించింది. అయితే ఇప్పుడు తాప్సీ.. మళ్లీ తెలుగులో రీఏంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ దర్శకత్వంలో అనే సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రగా తాప్సీ ఓ జర్నలిస్టు పాత్రలో నటిస్తుండగా.. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఎన్నో మలయాళం, తమిళ సినిమాల్లో నటించిన హరీష్పేరడీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. గతంలో మహేష్‌బాబు నటించి ‘స్పైడర్’ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు కనిపించన హరీశ్ ఈ సినిమాతో పూర్తిస్థాయిలో తెలుగులో ఓ పాత్రలో నటించడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CkTBHd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...