Thursday, 26 August 2021

షూటింగ్ గ్యాప్‌లో అలాంటి పని.. కలలో కూడా అదే.. రాశీ ఖన్నా పోస్ట్ వైరల్

టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నాకు ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వస్తున్నాయనే సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా రాశీ ఖన్నాకు కోలీవుడ్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఏకంగా విజయ్ సేతుపతి పక్కన రెండు చిత్రాల్లో నటిస్తోన్నారు. బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు రెడీ అయ్యారు. ఫ్యామిలీ మెన్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రాబోతోన్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అలా ఓటీటీలోకి రాశీ ఖన్నా కూడా ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఇక తెలుగులోనూ రాశీ ఖన్నా హవా కొనసాగుతూ ఉంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఒక్కటి బెడిసి కొట్టేసింది. అది కూడా వర్కవుట్ అయి ఉంటే రాశీ కెరీర్ మరింత స్పీడులో దూసుకుపోయేది. అయితే ఇప్పుడు రాశీ ఖన్నా మాత్రం వెంకీమామ, ప్రతీరోజూ పండుగే అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్లతోఉన్నారు. మళ్లీ ఇప్పుడు రాశీ ఖన్నా మారుతి దర్శకత్వంలోనే నటిస్తున్నారు. గోపీచంద్, మారుతి కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్నారు. అంటూ రాబోతోన్న ఈ మూవీ షూటింగ్‌లోనే రాశీ ఖన్నా పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే షూటింగ్ గ్యాప్‌లో ఇలా తాను ఓ కునుకు తీసేశానని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా నిద్రలో వెకేషన్‌కు వెళ్లినట్టు కల కూడా వచ్చిందట. అంటే మొత్తానికి వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో వెకేషన్స్ కూడా మిస్ అవుతున్నానని రాశీ ఖన్నా చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం రాశీ షేర్ చేసిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gA6t2P
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...