Thursday, 26 August 2021

స్పెషల్ ట్వీట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. దానిపై అభిమానులకు ఫుల్‌ క్లారిటీ

ఒకరేమో మెగా పవర్‌స్టార్ , మరొకరు ఏమో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వీళ్లిదరి కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళీ రూపొందిస్తున్న అతి పెద్ద యాక్షన్ చిత్రం ‘’. ‘బాహుబలి’ వంటి ప్రపంచస్థాయి సినిమా తర్వాత జక్కన దర్శత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. స్వతంత్ర సమరయోధుడు అల్లురి సీతారామ రాజుగా రామ్ చరణ్, గిరిజన యోధుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సినిమా విడుదల పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. అయితే ఇప్పటి వరకూ వచ్చిన ఈ సినిమా టీజర్లు, ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’, ఫస్ట్ సింగిల్ ‘దోస్తీ’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇవి చూసిన తర్వాత సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. రీసెంట్ యూక్రెయిన్‌లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇప్పటికే ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, కరోనా థర్డ్ వేవ్ వస్తుందని.. ఆ నేపథ్యంలో సినిమా విడుదల సంక్రాంతికి వాయిదాపడే అవకాశం ఉందని పుకార్లు పుట్టుకొచ్చాయి. వాటిపై తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్పష్టత ఇచ్చింది. ఒకే ఒక ట్వీట్‌తో ఫ్యాన్స్‌లో నెలకొన్న అపోహలు అన్ని చెరిపేసింది చిత్ర యూనిట్. ‘రెండు పికప్ షాట్లు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్. నవంబర్ 19, 2018లో ఏ బైక్ షాట్‌తో సినిమా షూటింగ్ ప్రారంభించామో.. చివరి షాట్ కూడా బైక్ షాట్ కావడం విశేషం’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. , ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UO4Dng
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...