Monday, 2 August 2021

ప్రభాస్ సినిమాలో ప్రత్యేక పాటలో కత్రినా కైఫ్.. ఆ సాంగ్ కంటే ఓ రేంజ్‌లో ఈ పాట

‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘సాహో’ సినిమా కాస్త నిరాశపరిచినప్పటికీ.. కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ప్రస్తుతం ఆయన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అలా ఆయన చేస్తున్న సినిమాల్లో కేజీఎఫ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సినిమా ‘సలార్’ ఒకటి. ఇప్పటికే ఈ సినిమాపై హైప్ ఓ రేంజ్‌లో ఉంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నటించనుందని టాక్ వినిపిస్తుంది. కేజీఎఫ్ సినిమాలో హిందీ వర్షన్‌లో హీరోయిన్ తమన్నాతో ఓ ప్రత్యేక సాంగ్‌లో స్టెప్పులు వేయించారు. అయితే ఆ పాట ఇతర భాషల్లో ప్రసారం కాకపోయినప్పటికీ.. బాలీవుడ్‌లో మాత్రం మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు కత్రినా చేసే ఈ సాంగ్ ఆ పాటని మించిపోయి ఓ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఇక కేజీఎఫ్‌ని రూపొందించిన హోంబలే ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా రవి బసుర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 16న ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభం అయింది. కేజీఎఫ్ స్టార్ యశ్ కూడా ఈ సినిమా ప్రారంభానికి వచ్చారు. ఇక భువన్ గౌడా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫీ అందిస్తుండగా.. గోదావరిఖనిలోని బొగ్గు గనుల్లో ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ జరిగింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37eiTrZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...