Monday, 2 August 2021

టుడే ఇన్‌స్టా హిట్స్.. : ఎక్స్‌తో, ప్రెజెంట్‌తో రష్మి.. ఇదే లైఫ్ అంటున్న శ్రేయా.. బీస్ట్ మోడ్‌లో వరుణ్

ఇది నా ఎక్స్.. ఇది ప్రజెంట్.. రష్మి ఆసక్తికర పోస్ట్ తెలుగులో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ.. మంచి గుర్తింపు రాకుండా ఉండిపోయిన నటి రష్మి. అయితే ‘జబర్ధస్త్’ అనే షో ఆమె జీవితాన్నే మార్చేసింది. ఈ షో తర్వాత ఆమెకు బుల్లితెరలో ఆఫర్లతో పాటు .. వెండితెరలో అవకాశాలు కూడా పెరిగిపోయాయి. తాజాగా ఫ్రెండ్‌షిప్‌ రోజు సందర్భంగా రష్మి ఆసక్తికర వీడియో పోస్ట్ చేసింది. ఇది నా ఎక్స్.. ఇది నా ప్రజెంట్ అంటూ ఆమె పేర్కొంది. అయితే ఆ వీడియోలో వర్షణి.. దీపికా పిల్లి ఉండటం విశేషం. ప్రస్తుతం ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అకిరాను మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టిన .. హీరో పవన్‌కళ్యాణ్‌తో వివాహం జరిగి.. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఆయనతో విడాకులు తీసుకున్నారు నటి రేణు దేశాయ్. భర్తతో విడిపోయినప్పటికీ.. ఏ మాత్రం మనోధైర్యంతో తన పిల్లలను ప్రయోజకులుగా చేస్తూ వస్తున్నారు రేణు. కాగా, లేటెస్ట్‌గా రేణు కుమారుడు అకిరా.. కర్రసాములో తన ప్రతిభను కనబరిచాడు. తన కొడుకు ప్రదర్శనను మెచ్చుకుంటూ రేణు దేశాయ్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే జీవితానికి అసలైన అర్థం.. తల్లిగా శ్రేయ ఘోషల్ ఆమె పాట పాడితే అది ఆపాత మధురం.. తెలుగు కానీ, హిందీ కానీ, ఏ భాషైనా కానీ ఆమె పాడిందంటే ఆ పాట ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్లాల్సిందే. అంతలా ప్రేక్షకులను తన గాత్రంతో మంత్రముద్గుల్ని చేసింది గాయనీ . తాజాగా తన కూతురితో ఫోటోని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఆ చిన్నారిని తన చేతిలో పట్టుకోవడం కంటే ఆనందం మరేది లేదని.. తన గుండె ఇప్పటి నుంచి ఆ పాపదే అని శ్రేయా పేర్కొంది. అసలు జీవితంలో ఆనందం అంటే ఇదే అని ఆమె స్పష్టం చేసింది. తాత పుట్టినరోజులో సాయిపల్లవి సందడి మలయాళం అమ్మాయి అయినప్పటికీ.. తెలుగులో అత్యంత క్రేజ్ సంపాదించుకున్న నటి సాయిపల్లవి. తెలుగులో గతంలో కొన్ని డ్యాన్స్ షోలలో పాల్గొన్నా.. ఈమెకు తగిన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మలయాళంలో తెరకెక్కిన ‘ప్రేమమ్’ అనే సినిమాతో వెలుగులోకి వచ్చింది సాయిపల్లవి. తాజాగా తన తాతగారి 85వ పుట్టినరోజు వేడుకల్లో ఆమె సందడి చేసింది. అందుకు సంబంధించిన పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. బీస్ట్ మోడ్‌లో .. అమ్మాయిలు చూస్తే ‘ఫిదా’ అవ్వాల్సిందే.. మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మొదటి నుంచి తన నటనలో వేరియేషన్ చూపిస్తూ.. అభిమానులను అలరిస్తూ ఉన్నాడు. ఇక సినిమాల ఎంపిక్ విషయంలో కూడా వరుణ్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. ప్రస్తుతం ఆయన బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘గని’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం అతను ఎంత కష్టపడుతున్నాడో.. ఓ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా తెలియజేశాడు. వరుణ్ బాడీని చూస్తే అమ్మాయిలు ఫిదా అవ్వాల్సిందే అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ihpdFq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...