Thursday, 12 August 2021

నా బలం అదే.. అందుకే ఇంత ఎనర్జీగా ఉన్నా!! అసలు సీక్రెట్ బయటపెట్టిన సింగర్ సునీత

ఈ మధ్యకాలంలో ఏదో ఒక కారణంతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గాయనిగా ఎంతో మంది హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న ఆమె.. సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. ప్రతి ఇంట గాత్ర మాధుర్యంతో మైమరిపిస్తోంది. గాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా, హోస్ట్‌గా సత్తా చాటుతూ దూసుకుపోతోంది. అయితే రీసెంట్‌గా ఆమె రెండో పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. తన కుటుంబ సభ్యులందరి అంగీకారంతో మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని పెళ్లాడింది సునీత. తన పిల్లల ప్రోత్సాహంతోనే తన పెళ్లి జరిగిందని చెప్పిన ఆమె, రెండో పెళ్లి విషయమై జరిగిన ట్రోల్‌ని తిప్పికొట్టింది. ఎవ్వరు ఎన్ని రకాలుగా కామెంట్స్ చేసినా పెద్దగా పట్టించుకోకుండా ప్రొఫెషన్‌పై దృష్టి పెట్టింది. మరోవైపు సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తూ వస్తోంది. లైవ్‌ సెషన్లలో పాల్గొంటూ అభిమానులతో ముచ్చటిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఎనర్జీ సీక్రెట్ ఇదే అంటూ ఓ స్టన్నింగ్ లుక్ పోస్ట్ చేసింది సునీత. తను పాట పడుతున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘పాట పాడటమే నా ఎనర్జీ’ అంటూ తన ప్రొఫెషన్‌పై ఉన్న ప్రేమను చాటుకుంది. ఆమె షేర్ చేసిన ఈ ఫొటోల్లో చేతిలో మైక్ పట్టుకొని ఎల్లో శారీలో మెరిసిపోతూ కనిపించింది సునీత. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m4XvhL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...