Thursday, 12 August 2021

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ఆన్ లూసిఫర్ రీమేక్ సెట్స్! రెగ్యులర్ షూటింగ్ షురూ

153వ సినిమాగా రాబోతున్న 'లూసిఫర్' రీమేక్‌ రెగ్యులర్ షూటింగ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు డైరెక్టర్ మోహన్ రాజా. మలయాళ సూపర్ హిట్ సినిమా 'లూసిఫర్'కు తెలుగు రీమేక్‌గా రాబోతున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనుండగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ తాజాగా రెగ్యులర్ షూటింగ్‌ మొదలుపెట్టారు. ఈ విషయాన్ని డైరెక్టర్ మోహన్ రాజా ట్విట్టర్ వేదికగా తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సారి మెగా సినిమాతో రాబోతున్నా అని ప్రకటిస్తూ యూనిట్ సభ్యులతో కలిసి దిగిన ఫొటో షేర్ చేశారు. దీనిపై మెగా ఫ్యాన్స్ పెద్దఎత్తున రియాక్ట్ అవుతూ బెస్ట్ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రొడక్షన్‌ డిజైనర్‌ సురేష్‌ సెల్వరాజన్‌ నేతృత్వంలో నిర్మించిన భారీ సెట్‌‌పై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. తొలి షెడ్యూల్ మేజర్ పార్ట్ ఇక్కడే షూట్ చేయనున్నారు. థమన్ బాణీలు కడుతున్న ఈ సినిమాలో నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలని చూస్తున్నారట. ఒరిజినల్ వర్షన్‌లో మంజు వారియర్ పోషించిన పాత్ర కోసం ఆమెను సంప్రదించారని టాక్. కాగా ఈ సినిమాలో ఓ సాంగ్ రికార్డింగ్ ఇప్పటికే పూర్తి చేశామని చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఓ చిరంజీవి అభిమానిగా ఈ రోజును తన జీవితంలో మర్చిపోలేనని.. ఇది తనకు ఎంతో, ఎంతో ప్రత్యేకం అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3saUIEG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...