Thursday, 26 August 2021

కాలేజీ రోజుల్లో పర్సనల్ మ్యాటర్.. భర్త నిరుపమ్ ముందు మంజుల ఓపెన్! షాకైన శ్రీముఖి

అంటే అంతగా తెలియకపోయినా బుల్లితెర డాక్టర్ బాబు అంటే మాత్రం ఏజ్ గ్యాప్ లేకుండా ప్రతి ఒక్కరి మదిలో ఆయన రూపం మెదులుతుంటుంది. 'కార్తీకదీపం' సీరియల్‌తో ఓ రేంజ్ పాపులారిటీ కూడగట్టుకున్నారు నిరుపమ్. బుల్లితెర శోభన్ బాబుగా కీర్తించబడుతూ ప్రతి ఇంట సందడి చేస్తున్నారు. ఇక వీలు కుదిరినప్పుడల్లా స్పెషల్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టీవీ షోలో తన భార్య మంజులతో కలిసి అటెండ్ అయ్యారు. అయితే ఈ ఈవెంట్‌లో ఓ సీక్రెట్ బయటపెట్టడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. వచ్చే ఆదివారం జీ తెలుగులో ప్రసారం కాబోతున్న ‘అల బృందావనములో' అనే షోలో భార్య మంజులతో పాటు అటెండ్ అయ్యారు నిరుపమ్. శ్రీముఖి హోస్ట్ చేసిన ఈ షోలో టాలీవుడ్ హీరోలు సుధీర్ బాబు, శ్రీ విష్ణు, సుశాంత్‌లు కూడా స్పెషల్ గెస్టులుగా వచ్చారు. తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేయగా.. అంతా కలిసి వేదికపై తెగ సందడి చేస్తూ కనిపించారు. కాలేజీ రోజులు, గత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. అయితే నిరుపమ్ భార్య మంజుల తన కాలేజీ రోజుల్లోనాటి ఓ పర్సనల్ విషయం చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. 'కాలేజ్‌లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ సిగరెట్ ట్రై చేయాలని అనుకుంది' అని మంజుల చెప్పడంతో వెంటనే శ్రీముఖి నోరెళ్లబెట్టింది. అయితే తనకైతే అలంటి ఉద్దేశం లేదని మంజుల చెప్పడం, దానికి డాక్టర్ బాబు స్పందిస్తూ ఉద్దేశాల గురించి ఎందుకులే కానీ, ఆ తర్వాత ఏమైందో చెప్పు అని అనడం ఈ ప్రోమో వీడియోలో హైలైట్ అయింది. ఈ సీన్ చూసి అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు. ‘చంద్రముఖి' అనే సీరియల్‌లో లీడ్ రోల్స్ పోషించిన నిరుపమ్ పరిటాల, మంజుల ఆ తర్వాత బాగా దగ్గరై పెళ్లి చేసుకున్నారు. ఈ సీరియల్ జరుగుతున్న సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఇంట్లో వాళ్ళ అంగీకారంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gzGNTM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...