సినిమాల్లో నీతులు చెప్పే సెలబ్రిటీలు తమ సొంత వ్యవహారాన్ని సర్దుబాటు చేసుకోలేక గబ్బు లేపుతున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ‘మా’ సమస్యని రచ్చకెక్కిస్తున్నారు. తాజాగా నటి ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు జరగకుండా చేసి.. ఆయనే అధ్యక్షుడిగా కొనసాగడానికి పావులు కదుపుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నటి హేమ. ఈ సందర్భంలో నరేష్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ మా ఉపాధ్యక్షురాలు హేమ వాయిస్ మేసేజ్ కలకలం రేపుతోంది. ‘ఈ వాయిస్ మెసేజ్‌లో మా ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు హేమ. రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు మాత్రమే అధ్యక్షుడు నరేశ్ ఇప్పటివరకూ ఖర్చు చేశారని.. మిగతావి ఏం చేశారని ఆమె ప్రశ్నించారామె. మా అసోసియేషన్ కోసం ఒక్క రూపాయి కూడా కూడబెట్టలేదని అన్నారు. నరేష్ కుర్చీ దిగాలని అనుకోవడం లేదని.. హాయిగా మా ప్రెసిడెంట్ కుర్చీలో కుర్చుని ఉన్న డబ్బుని మొత్తం ఖర్చుపెట్టేస్తున్నాడని ఆరోపించారు హేమ. ఈ మేరకు శనివారం నాడు మా మెంబర్స్ 200 మందికి బహిరంగ లేఖలు రాస్తూ సంతకాల సేకరణ ప్రారంభించారు హేమ. ఇదిలా ఉంటే.. హేమతో పాటు ‘మా’ అధ్యక్ష పీఠం కోసం మంచు విష్ణు, జీవిత, సీవీఎల్ నరసింహారావు బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fFCCW8
v
No comments:
Post a Comment