Saturday, 28 August 2021

ఫహాద్ ఫాజిల్ అలాంటి వాడా.. ‘పుష్ఫ’ విలన్ గురించి ఆసక్తి రేపుతున్న లేటెస్ట్ వార్త?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘’. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూడో చిత్రమింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్లు ఈ అంచనాలను ఇంకా పీక్స్‌కి వెళ్లిపోయాయి. పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ కానీ, విజువల్స్‌ కానీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు.. చివర్లో అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. ఇక లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి ‘దాక్కో దాక్కో మేక’ అనే పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఐదు భాషల్లో, ఐదుగురు సింగర్లతో ఈ పాటను పాడించారు. ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆలరిస్తుంది. అయితే లేటెస్ట్‌గా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న మలయాళ సూపర్‌స్టార్ పాత్రను పరిచయం చేసింది చిత్ర యూనిట్. ఇందులో గుండుతో ఫాహాద్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ భయంకరమైన పోలీస్ ఆఫసీర్‌కు గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్యాంగకు బీభత్సమైన పోరాట సన్నివేశాలు ఉండోబోతన్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో ఫహాద్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఆయనకు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుందట. ఫహాద్ పాత్ర గురించి ఇంట్రో ఇచ్చిన సమయంలోనూ మేకర్స్ కేవలం ఒకే కన్నుతో ఉన్న లుక్ విడుదల చేశారు. లేటెస్ట్‌గా విడుదల అయిన పోస్టర్‌లోనూ ఆయన ఒక భాగం మొత్తం నీడలో ఉండగా మరో భాగం మాత్రం వెలుతురులో ఉంది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మరి దీనిపై కచ్చితమైన స్పష్టత రావాలి అంటే సినిమా వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BiRhPw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...