Saturday, 28 August 2021

ఓవైపు డబ్బు.. మరోవైపు చేతిలో కోడి.. రాజ్ తరుణ్ ‘అనుభవించడం’ మామూలు లేదు

పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు . ఆ తర్వాత వెండితెరపైకి కూడా అడుగుపెట్టాడు అతను. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం రాజ్ తరుణ్.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత డజనుపైగా సినిమాల్లో అతను నటించాడు. పెద్దగా హిట్లు లేకపోయినా.. తన సినిమాలతో అతను కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం రాజ్‌తరుణ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అందులో అతను నటిస్తున్న ఓ విభిన్నమైన సినిమా ‘స్టాండప్‌ రాహుల్’ ఈ సినిమాలో శాంటో మెహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఓ స్టాండప్‌ కమెడియన్‌గా నటిస్తున్నాడు. వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి. తాజాగా రాజ్‌తరుణ్ మరో సినిమా అప్‌డేట్ వచ్చింది. ఆ అప్‌డేట్‌ని స్వయంగా అక్కినేని విడుదల చేశారు. ‘’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని నాగార్జున ట్వీట్ చేశారు. గతంలో రాజ్‌తరుణ్‌తో కలిసి ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీను గవిరెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వెనుక గుడి గోపురం.. ఒక పక్క డబ్బు.. మరో పక్క హీరో చేతిలో కోడిని చూసే.. ఇది కోడి పందెలు నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అని అర్థం అవుతోంది. అన్నపూర్ణ స్టూడియస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌‌డేట్లు త్వరలోనే తెలియనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38iAFuK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...