Thursday, 5 August 2021

దీపావళి కానుకగా వరుణ్ తేజ్ సినిమా.. మెగా ప్రిన్స్ మొదటి పంచ్‌ పడేది ఆ రోజే!

మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు మెగా ప్రిన్స్ . ‘ముకుందా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్.. ఆ తర్వాత హిట్ కోసం చాలాకాలం ఎదురుచూశాడు. అయితే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు వరుణ్. ఆ తర్వాత ‘ఎఫ్‌ 2’, ‘గద్దలకొండ గణేష్’ తదితర సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ‘ఎఫ్‌ 2’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘ఎఫ్‌ 3’తో పాటు.. ‘’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. దర్శకత్వంలో రూపొందుతున్న ‘గని’ చిత్రంలో సైయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే గత ఏడాది జూలై నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, కరోనా కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ వాయిదాపడుతూ వచ్చింది. అంతేకాక.. ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ సెట్‌లో కొందరికి కరోనా రావడంతో వరుణ్ కూడా ఐసోలేషన్‌కి వెళ్లాడు. దీంతో షూటింగ్‌కి మరింత అంతరాయం ఏర్పడింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. సినిమాను ఈ ఏడాది దీపావళీ కానుకగా విడుదల చేయనున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ అన్ని సన్నాహాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రానుందని టాక్. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సిద్ధూ ముద్దా మరియు అల్లు బాబీలు నిర్మాణం వహిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ClLz0v
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...