Thursday, 5 August 2021

ప్రభాస్ చాలా డెడికేటెడ్ ఆర్టిస్.. ఆ సినిమా జరిగిన సమయంలో ప్రతీ రోజు ఏం తిన్నారంటే: సంజనా

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ‘బాహుబలి’ సినిమాకు ముందు దక్షిణాదికి మాత్రమే పరిమితమైన ఆయన క్రేజ్ ఆ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. నుంచి సినిమా ఎప్పుడు వస్తుందా అని కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇందులో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాధేశ్యామ్’ సినిమా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల అవుతున్నట్లు ఈ మధ్యనే చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో పాటు.. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్’ అనే సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారు. దీంతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అని రామాయణం ఆధారంగా రూపొందుతున్న సినిమాని కూడా చేస్తున్నారు. అయితే ప్రభాస్ కెరీర్‌లో అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాల్లో ‘బుజ్జిగాడు’ ఒకటి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హీరోగా ప్రభాస్ కెరీర్‌ని మరో లెవల్‌కు తీసుకువెళ్లింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన .. ప్రభాస్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను లేటెస్ట్‌గా వెల్లడించింది. ప్రభాస్ అంత డెడికేటెడ్ ఆర్టిస్ట్‌ని ఇప్పటివరకూ చూడలేదు అని సంజనా పేర్కొంది. ఆయన రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. ఎంతో కష్టపడతారు అని తెలిపింది. తన బాడీ ఫిట్‌గా కనిపించడం కోసం ఎంతో కృషి చేస్తారని ఆమె స్పష్టం చేసింది. సినిమాలో లీన్‌గా కనిపించడం కోసం షూటింగ్ సమయంలో కేవలం పెసరట్లు మాత్రమే తిన్నారు అని ఆమె పేర్కొంది. అలాంటి వ్యక్తిని తను ఎప్పుడు చూడలేదు అని ఆమె చెప్పుకొచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AeqDXq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...