Thursday, 5 August 2021

ఇదీ బాలకృష్ణ రియల్ క్యారెక్టర్‌.. అవసరానికి అర్ధరాత్రి కాల్ చేస్తే! రహస్యం బయటపెట్టిన యాంకర్ ప్రదీప్

బుల్లితెరపై టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్నారు ప్రదీప్ మాచిరాజు. టాప్ రేంజ్ మేల్ యాంకర్లలో ఒకరిగా ఉన్న ఆయన ప్రస్తుతం పలు బుల్లితెర షోస్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన హోస్ట్ చేస్తున్న షోస్ అన్నీ కూడా భారీ టీఆర్ఫీ తెచ్చుకుంటూ ప్రదీప్ ఫాలోయింగ్ అమాంతం పెంచేస్తున్నాయి. షో హోస్ట్ చేయడంలో తనకు సాటెవ్వరూ రారన్నట్లుగా హంగామా చేస్తున్న ప్రదీప్.. తాజాగా జరిగిన ఓ షోలో నందమూరి నటసింహం బాలకృష్ణపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. 'డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' అనే షో హోస్టింగ్ చేస్తున్న .. బాలయ్య బాబు రియల్ క్యారెక్టర్ బయటపెట్టారు. జూనియర్ పేరొందిన ప్రజ్వల్ నటసింహా ఈ షోలో ఓ స్కిట్ చేస్తూ కడుపుబ్బా నవ్వించాడు. ''అయినవాళ్లకు కష్టమొస్తే అరగంట ఆలస్యంగా వస్తాడేమో కానీ.. ఆడపిల్లలకు కష్టం వస్తే అర క్షణం కూడా ఆగడు మా బాలయ్య.. జై జై బాలయ్య'' అనే డైలాగ్ చెప్పి అక్కడున్న అందరినీ హుషారెత్తించాడు. ఈ స్కిట్ తర్వాత పిల్లలంతా కలిసి జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ ఆయన కటౌట్‌ను ప్రదర్శించారు. లెజెండ్ అంటూ తెగ పొగిడారు. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్, బాలకృష్ణ క్యారెక్టర్‌ గురించి మాట్లాడుతూ ఓపెన్ అయ్యారు. ''బాలకృష్ణ స్టైల్, ఆయన తీరు ఎప్పుడూ అలా సింహం లాగే ఉంటుంది. క్యాన్సర్ ఆస్పత్రిలో కానీ, ఎక్కడైనా కానీ హెల్ప్ కావాలంటే ఫస్ట్ ఫోన్ కాల్ నేను చేసేది బాలయ్య బాబు గారికే. అప్పటికప్పుడు కాల్స్ చేసి ఎంతోమందికి ఆయన ట్రీట్‌మెంట్ చేయించారు. అర్ధరాత్రైనా నాకు ఫోన్ చెయ్ అన్నారాయన. ఆ ఒక్క మాట చాలు, ఆయనిచ్చిన ధైర్యం చాలు'' అని బాలయ్య రియల్ క్యారెక్టర్‌ బయటపెట్టారు ప్రదీప్. ఇక చివరగా ఆలీ రియాక్ట్ అవుతూ.. ఆయన మైండ్‌లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పే స్వభావం బాలయ్య బాబుది అన్నారు. అద్భుతమైన సేవలు చేస్తున్న బాలయ్య గారికి హాట్సాఫ్ అంటూ వేదిక ప్రాంగణాన్ని హూషారెత్తించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jptiqv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...