Saturday, 14 August 2021

‘ఆ టైమ్‌లో మీ సేవలు అనిర్వచనీయం’.. హీరో నిఖిల్‌ను సత్కరించిన కమిషనర్

సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్‌లో విలయతాండవం చేసింది. రెండు నెలల క్రితం ప్రతీ రోజు దాదాపు 4 లక్షలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను ఖననం చేసేందు స్మశానవాటికల్లో చోటు దొరకని భయంకర పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధించింది. పటిష్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేయడంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా చాలా తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఇది కాస్త సంతోషంగానే అనిపిస్తున్న మరోవైపు థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది అనే వార్త ప్రజల మదిలో గుబులును పుట్టిస్తుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది ప్రముఖుల ప్రజలకు అండగా నిలిచారు. అందులో హీరో నిఖిల్ సిద్ధార్త్ ఒకరు. సోషల్‌మీడియా ద్వారా అవసరంలో ఉన్నవారి సమాచారం అందుకొని.. ఆయన సహాయం అందించారు. ఆక్సిజన్, వ్యాక్సినేషన్, మందులు, ఇలా ఎవరికి ఏ సహాయం అవసరమైన ఆయన చేశారు. తాజాగా తాను చేసిన సేవలకు గాను పోలీస్ కమిషనర్‌ నిఖిల్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. ఆయన కార్యాలయానికి పిలిచి.. నిఖిల్‌కు శాలువా కప్పి,, బొకే ఇచ్చి ఆయన అభినందించారు. ఈ విషయాన్ని నిఖిల్ స్వయంగా ట్వీట్ చేశారు. తనకు ఇలాంటి గౌరవం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే నిఖిల్ ప్రస్తుతం ‘18 పేజెస్’, ‘కార్తీకేయ-2’ అనే సినిమాలో చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆయన ‘18 పేజెస్’ సినిమా పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AFPHH9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...