Saturday, 14 August 2021

ముంబై వెళితే అవి కంపల్సరీ తీసుకెళ్తా.. అందరూ అదే అడుగుతారు! బలి కాబోయేది వాళ్ళేనంటూ తమన్నా ఓపెన్

వెండితెరతో సరి సమానంగా బుల్లితెర హంగామా నడుస్తున్న ఈ రోజుల్లో సినీ తారలు సైతం టీవీ తెరపై హంగామా చేస్తుండటం చూస్తున్నాం. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్, నాని లాంటి తెలుగు హీరోలు బుల్లితెరపై ప్రోగ్రామ్స్ హోస్ట్ చేసి భేష్ అనిపించుకున్నారు. కూడా బుల్లితెర బాట పట్టి 'మాస్టర్ చెఫ్' ప్రోగ్రాంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో స్వతహాగా భోజన ప్రియురాలైన ఆమె తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫుడ్‌పై తనకున్న మక్కువ తెలిపింది. తాను ఫుడీ అని తెలుపుతూ తనకు ఆహారం అంటే ప్రాణమని, ఆరోగ్యానికీ ఆహారానికి సమ ప్రాధాన్యం ఇస్తానని చెప్పింది. ఆహారాన్ని భిన్నమైన మార్గాల్లో నిరంతరంగా ఎక్స్‌ప్లోర్‌ చేస్తూనే ఉంటానని చెప్పిన ఆమె, ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా అక్కడి ‘థాలీ’ కోసం వెతుకుతూ ఉంటానని చెప్పింది. అలాగే తనకు తెలుగు వంటకం చేపల పులుసు అన్నా, హైదరాబాదీ బిర్యానీ అన్నా చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. తన ముంబై స్నేహితులు కూడా హైదరాబాదీ బిర్యానీ బాగా ఇష్టపడతారని, హైదరాబాద్‌ వచ్చిన ప్రతిసారీ బిర్యానీ తీసుకురమ్మని అడుగుతుంటారని తెలిపింది. అందుకే హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిన ప్రతిసారీ బిర్యానీ వెంట తీసుకెళ్తుంటానని చెప్పింది. అలాగే స్వీట్స్, పూతరేకులంటే తనకు ప్రాణమని చెప్పింది. ఇప్పటివరకు తినడమే తప్ప ఏ వంటకాన్నీ వండే ప్రయత్నం చేయలేదని, అయితే ఇప్పుడు కుకింగ్ షో హోస్ట్ చేయడం వల్ల తనకు వంటల పట్ల ఓ అవగాహన వచ్చిందని చెప్పింది. ఇక ఈ సారి ఇంటికెళ్లినప్పుడు కచ్చితంగా గరిట తిప్పుతానని, తన వంటకు మొదట బలి కాబోయేవాళ్లు తన కుటుంబ సభ్యులే అంటూ ఓపెన్‌గా మాట్లాడింది తమన్నా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iKFlzs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...