Saturday, 14 August 2021

విశాఖపట్నంలో రౌడీ గాడి హంగామా.. సందీప్ కిషన్ డిఫరెంట్ ట్రాక్.. షర్ట్ బటన్ విప్పాడు ఓ మై గాడ్!!

కెరీర్ ఆరంభం నుంచే డిఫరెంట్ సినిమాలతో అలరిస్తూ వస్తున్నాడు యంగ్ హీరో . వెర్సటైల్ చిత్రాల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ కుర్ర హీరో ఇటీవలే A1 ఎక్స్‌ప్రెస్ సినిమాతో పలకరించి ఇప్పుడు '' అవతారమెత్తాడు. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌ సరసన నేహా శెట్టి హీరోయిన్‌‌గా నటిస్తోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి '' సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ''విశాఖపట్నంలో రౌడీ గాడు.. షర్టు బటనిప్పాడు ఓ మై గాడు'' అంటూ సాగే ఈ పాటలో సందీప్ కిషన్ లుక్స్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. హీరో నితిన్ ఈ సాంగ్ రిలీజ్ చేశారు. యూత్ ఆడియన్స్ టార్గెట్‌గా ఈ సినిమా రూపొందుతోందని స్పష్టమవుతోంది. భాస్కరభట్ల రాసిన లిరిక్స్‌పై యాజిన్ నైజర్ పాడిన ఈ పాటకు సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు. ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’ తర్వాత సందీప్‌ కిషన్‌- నాగేశ్వరరెడ్డి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఎంవీవీ సినిమా, కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ పోషిస్తున్నారు. ప్రతినాయకుడిగా బాబీ సింహా నటిస్తున్నారు. పోసాని కృష్ణ మురళీ, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iLnPet
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...