Friday, 27 August 2021

పుష్ప నుంచి మరో లేటెస్ట్ అప్‌డేట్.. విలన్‌ని చూసేందుకు రెడీగా ఉండండి..

ఎర్ర చందనం స్మగ్లింగ్, అటవీ బ్యాక్‌డ్రాప్, మొత్తం మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ కలిపిస్తే.. ఆ సినిమానే ‘’. హీరోగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు నటిస్తున్న ప్రతీ ఒక్కరు స్టార్స్ కావడం కూడా మరో విశేషం. అయితే తొలుత ఒక భాగంగా విడుదల అవుతుందని అనుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండు భాగాలుగా విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా టీజర్‌ చివర్లో అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. ఇక రీసెంట్‌గా సినిమా నుంచి ‘దాక్కో దాక్కో మేక’ అనే పాటని కూడా విడుదల చేశారు. ఈ పాటని ఐదు భాషల్లో, ఐదుగురు సింగర్స్‌తో పాడించారు. తాజాగా సినిమా యూనిట్ మరో‌ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అదేంటంటే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న మలయాళ సూపర్‌స్టార్ పాత్రను శనివారం ఉదయం 10.08కి రివీల్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ రీసెంట్‌గా ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం ఫహాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాత్రను పరిచయం చేశారు. ఇందులో ‘చెడు అంత భయంకరం కాదు’ అంటూ ఫహాద్ ఒక కన్ను మాత్రమే చూపించారు. అయితే ఇంట్రో పోస్టరే ఇలా ఉంటే.. త్వరలో వచ్చే ఫుల్ పోస్టర్ ఎలా ఉంటుందా అని అభిమానుల్లో ఆసక్తి ప్రారంభం అయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ykhpYl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...