Thursday, 5 August 2021

మాజీ ప్రధానమంత్రి గెటప్‌లో హీరోయిన్.. ఆమె డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు..

ఎవరైనా ఓ ప్రముఖ వ్యక్తి గెటప్‌లో నటించాలి అంటే దానికి ఎంతో ధైర్యం ఉండాలి. ఆ గెటప్‌లో అచ్చం అలాగే కనిపించేందుకు ఎంతో శ్రమ పడాలి. కొన్నిసార్లు ఎంతో బరువు తగ్గడమో లేక పెరగడమే చేయాల్సి వస్తుంది. ఇలా ఇప్పటికే చాలా మంచి కూడా కొన్ని బయోపిక్‌లలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే తాజాగా మరో నటి కూడా ఓ పాత్ర కోసం అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయి.. ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆమె ఒకప్పటి విశ్వసుందరి, హీరోయిన్ . బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘’. రంజీత్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హుమా ఖురేషీ, వాణీ కపూర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. 1984లో జరిగిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ హైజాక్‌ను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను చిత్రీకరించారు. అయితే ఈ సినిమాలో నటి లారా దత్తా ఇప్పటి ప్రధాన మంత్రి పాత్రలో నటిస్తోంది. ఈ మధ్యే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.. లారా పాత్ర రివీల్ అయింది. అయితే ఈ పాత్రలో లారా అచ్చం ఇందిరా గాంధీలానే కనిపిస్తోంది. అసలు ఆమెను చూస్తే ఇందిరా గాంధీనే మళ్లీ పుట్టిందా అనే ఉంది. ప్రోస్థటిక్‌ మేకప్‌ సాయంతో అంతలా ఆమెను ఇలా తీర్చిదిద్దారు. దీనిపై లారా తాజాగా స్పందించింది. తను ఇందిరా గాంధీలా మారేందు పడిన శ్రమపై ఆమె ఓ వీడియోని ట్వీట్ చేసింది. అంత గొప్ప నాయకురాలి పాత్రలో నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉంది అని ఆమె పేర్కొంది. ఇందుకోసం చాలా హోంవర్క్ చేశాను అని.. నటిగా తన జీవితంలో ఇలాంటి అరుదైన పాత్రలో నటించే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది అని లారా స్పష్టం చేసింది. ఇక ఇందిరా గాంధీలా కనిపించేందుకు లారా చూపించిన డెడికేషన్ చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె కష్టాన్ని మెచ్చుకుంటూ వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lLRK8z
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...