Thursday, 5 August 2021

‘మాస్ కా దాస్‌’తో కలిసి నటించనున్న ఐకాస్ స్టార్.. ఆ క్లాసిక్ సినిమాలో కీలక పాత్రలో బన్నీ..

కొందరు హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిలో నిలిచిపోతాయి. ఆ సినిమాలు ఎప్పుడు వచ్చినా చూసేందుకు వాళ్లు సిద్ధంగా ఉంటారు. అది వెండితెర మీద అయినా కానీ.. లేదా బుల్లితెర మీద వచ్చిన ఆ హీరో సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. అలా చేసిన సినిమాలు కొన్నే అయినప్పటికీ.. ప్రేక్షకుల మదిలో గొప్ప స్థానం సంపాదించుకున్న నటుడు . ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నామా దాస్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆయన కొన్ని రోజుల క్రితం ‘హిట్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం విశ్వక్‌సేన్ ‘పాగల్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు నరేష్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ ఓ లవర్‌బాయ్‌ల కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘’ అనే సినిమాని ఆయన తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాలో ఐకాన్ స్టార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. తమిళ సినిమాలో విజయ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించారు. ఆ పాత్రలో తెలుగులో అల్లు అర్జున్ కనిపించనున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయ్యాయని.. ‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఈ సినిమాలో నటిస్తున్నారని ఫిలిమ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా సమాచారం వచ్చే వరకూ ఎదురుచూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AqG2Er
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...