Saturday, 14 August 2021

‘ఎంతో తికమకపడే.. విడాకులు తీసుకున్న భర్త’.. హీరో సుమంత్ గురించి లేటెస్ట్ అప్‌డేట్

టాలీవుడ్ హీరో, అక్కినేని నాగేశ్వరరావు మనవడు గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయిన. ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉంటూ పలు ఆఫర్‌లను అందుకుంటున్నారు. కెరీర్ ఆరంభం నుంచి బ్లాక్‌బస్టర్ హిట్లు లేకపోయినా.. ఆయన సినిమా విభిన్నమైన సినిమాలు చేయడంలో ఏ రోజు వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా ఎక్కువశాతం క్లాస్ సినిమాలతో ఆయన ప్రేక్షకులను అలరించారు. అయితే కొద్ది రోజుల క్రితం సుమంత్ ఓ అనుకోని విషయంలో వార్తల్లో నిలిచారు. ఆయన రెండో పెళ్లి చేసుకుంటున్నారు అంటూ సోషల్‌మీడియాలో ఓ రేంజ్‌లో రూమర్స్ చెక్కర్లు కొట్టాయి. అయితే అది నిజం కాదని కేవలం ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘’ కోసమే అని ఆ తర్వాత తెలుసుకున్నారు నెటిజన్లు. విడాకుల చుట్టు ఈ సినిమా కథ తిరుగుతోంది. ఈ సినిమా నుంచి రోజుకో పోస్టర్‌ని విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్ లేటెస్ట్‌గా హీరో సుమంత్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో ఆయన్ని ‘తికమకపడే విడాకులు తీసుకున్న భర్త’గా అభివర్ణించారు. ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడే ఆయన, వంటబాగా చేస్తాడని పోస్టర్ ద్వారా చెప్పారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. , పోసాని కృష్ణ మురళీ, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే వీరందరికి సంబంధించిన పోస్టర్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా సాగే ఈ సినిమాకు కీర్తి కుమార్ దర్శకత్వం వహించగా.. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UlB0cS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...