తమిళనాడులో స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో దళపతి పేరు మొదటి వరుసలో ఉంటుంది. మన తెలుగు ఇండస్ట్రీలో పవరస్టార్ పవన్‌కళ్యాణ్‌కి ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందో.. తమిళ్‌లో విజయ్‌కి కూడా అదే రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే అభిమానులు చేసే సందడి మామూలుగా ఉండదు. ఇక ఈ ఏడాది ‘ఖైదీ’ చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘మాస్టర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు విజయ్. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ‘’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయట. అయితే రేట్ ఎంతో తెలియదు కానీ.. ప్రముఖ ఓటీటీ ఈ సినిమా ఓటీటీ ప్రసార హక్కులను దక్కించుకుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికైతే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతానికి ఇది పుకారు మాత్రమే అని తెలుస్తోంది. ఇక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iLezXN
v
No comments:
Post a Comment