Wednesday, 11 August 2021

‘ఎఫ్‌3’ సినిమాపై మరో అప్‌డేట్.. సినిమాలో వెంకటేష్ పాత్ర అలా.. వరుణ్ పాత్ర ఇలా..!

విక్టరి , మెగా ప్రిన్స్ హీరోలుగా.. తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్2’. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు.. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్‌‌ను షేక్ చేసింది. పూర్తిస్థాయి కామెడీ సినిమాగా రూపొందిన ఈ సినిమా మంచి విలువలను కూడా నేర్పించింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ‘’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక మొదటి పార్ట్‌లో భార్య, భర్తల మధ్య జరిగే గొడవలు, విడిపోవడం, ఆ తర్వాత వాళ్ల తప్పులు తెలుసుకొని మళ్లీ కలుసుకోవడం చూపించిన దర్శకుడు రెండో భాగంలో మాత్రం డబ్బు సంపాదించేందుకు హీరోలు పడే కష్టాలు, దాని నుంచి వచ్చే వినోదాన్ని చూపించనున్నారు. చాలా రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ఇద్దరు హీరోల చుట్టు డబ్బు నోట్లు ఉండటం మనం గమనించవచ్చు. అయితే ఈ సినిమాపై కొన్ని రోజుల క్రితం దర్శకుడు అనిల్ క్లారిటీ ఇచ్చారు. తొలి సినిమాకు ఇది సీక్వెల్ కాదు అని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదీ ఈ సినిమాలో హీరోల పాత్రలు. ఈ సినిమాలో వెంకటేష్‌ రేచీకటి ఉన్నవాడిగా.. వరుణ్ తేజ్ నత్తి ఉన్నవాడిగా నటిస్తున్నారని సమాచారం. వారికి ఉన్న లోపాలు చూపిస్తూ సినిమాను ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ తో సాగించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా స్పష్టత లేదు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఎఫ్ 3 సినిమాను కరోనా సెకండ్ వేవ్ కు ముందు ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. కాని షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల కొత్త విడుదల తేదీ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XkcNVp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...