Wednesday, 11 August 2021

ప్రభాస్‌‌తో డేటింగ్ చేస్తా.. మెసేజ్ కూడా పెట్టా! ఎలాగూ పెళ్ళాం లేదు కాబట్టి.. దివి ఓపెన్ కామెంట్స్

మోడలింగ్ నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి తొలి ఎపిసోడ్‌లోనే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది హైదరాబాదీ బ్యూటీ . ‘మహర్షి’ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ అవకాశాలేవీ రాకపోయినా ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా నిత్యం సోషల్ మీడియా వేదికగా అభిమానులను టచ్ చేస్తోంది. ఏదో ఒక రోజు తప్పకుండా స్టార్ అవుతానని ధీమా వ్యక్తం చేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్‌పై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టింది. ''అందరిలాగే నాకు ప్రభాస్ అంటే క్రష్. ఆయన మూవీస్ చూస్తున్నా.. నచ్చుతున్నాడు, ఇంకా నచ్చుతున్నాడు. నాకెలాగైతే ఇన్స్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ వస్తాయో నేను కూడా ప్రభాస్‌‌కి అలాగే ఇన్స్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టాను. ఐ లవ్ సో మచ్ ప్రభాస్.. ఒక్కసారి చూస్తే చాలు, ఒక్కసారి కలిస్తే చాలు. మిర్చిలో పడిపోయాను. ఆ తర్వాత కూడా పడేస్తూనే ఉన్నాడు. ప్రభాస్‌ని ఇప్పటిదాకా చూడలేదు.. కానీ ఆయన చాలా మంచి వ్యక్తి అని విన్నా. ఒకవేళ ఆయన కలిస్తే ఓ డీసెంట్ డేట్ అడుగుతా. మిర్చి లాంటి కుర్రోడితో కలిసి ఓ కాఫీ తాగితే చాలు. నాకు తెలిసి ఆ రోజు వస్తుంది. ఆయన్ను తప్పకుండా కలుస్తా'' అని దివి తన మనసులో మాట చెప్పింది. అంతేకాకుండా హీరోల్లో ఎవరినైనా లవ్ చేయాల్సి వస్తే నాగార్జునతో లవ్ అని చెప్పిన దివి.. డేట్ విషయంలో అది రెండు మూడు రోజులైనా ప్రభాస్‌తోనే అని చెప్పింది. ఇక పెళ్లి చేసుకోవాలంటే మాత్రం.. ప్రభాస్‌కి పెళ్ళాం లేదు, అలాగే రామ్‌కి కూడా పెళ్ళాం లేదు కాబట్టి ఇద్దరిలో ఎవ్వరైనా ఓకే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది దివి. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U8Q9Ot
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...