Wednesday, 11 August 2021

‘రాజు వస్తున్నాడు బహుపరాక్’.. శ్రీ విష్ణు సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది..

కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు యంగ్ హీరో శ్రీ విష్ణు. రొటీన్‌గా కాకుండా కాస్త విభిన్నంగా ఉంటాయి ఆయన సినిమాలు. కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసి.. ఆ తర్వాత హీరోగా ఎదిగిన ఆయన ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. సినిమా వస్తుందంటే చాలు.. అందులో మనకి కావాల్సినంత వినోదం ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘’. కొంతకాలం క్రితం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు శ్రీ విష్ణు విడుదల చేశారు. ఈ పాత్రతో మీ ముందుకి రావడం తన అదృష్టమని. ఈ కిరీటం ధరించినందుకు మీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తానన్నది నా శపథమంటూ అప్పుడు ఆయన ట్వీట్ చేశారు. ఆయన అన్నట్లుగానే టీజర్ ప్రేక్షకుల చేత నవ్వులు పూయించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను ఆగస్టు 19వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన శ్రీ విష్ణు.. ‘ఈ అవతారంలో మిమ్మల్ని గట్టిగా నవ్వించే పూచీ నాది అంటూ’ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికొస్తే.. మేఘా ఆకాష్, సునయినా ఇరువురు హీరోయిన్లుగా నటిస్తుండగా.. బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ కూడా ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. రవి బాబు ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారని టీజర్ చూస్తే తెలుస్తోంది. హసిత్‌ గోలి దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ ‘రాజ రాజ చోర’ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో నవ్విస్తాడో తెలియాలంటే ఆగస్టు 19 వరకూ వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fVZy3B
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...