Thursday, 1 July 2021

Shyam Singha Roy : ‘శ్యాం’ ఈజ్ బ్యాక్.. రంగంలోకి దిగిన నాని

నేచురల్ స్టార్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వరుసగా రెండు మూడు ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేశారు. ఇప్పటికే టక్ జగదీశ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు సినిమాను వాయిదా వేశారు. ఓటీటీలోనే ఈ మూవీ రాబోతోందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అలా నాని తన సినిమా షూటింగ్‌లతో ఇప్పుడు మళ్లీ బిజీ కాబోతోన్నారు. తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను నాని అందించారు. ఈ దెబ్బకు నాని సినిమా నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. నాని ప్రస్తుతం శ్యామ్ సింఘరాయ్, అంటే సుందరానికీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతోన్న సినిమా షూటింగ్ గత ఏడాదే మొదలుపెట్టేశారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి, కృతి శెట్టిలు హారోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. నేడు ఈ మూవీ షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఇదే చివరి షెడ్యూల్ అంటూ నాని రంగంలోకి దూకారు. శ్యాం ఈజ్ బ్యాక్ అంటూ యాక్షన్ సీక్వెన్స్‌ను మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. మొత్తానికి నాని ఈ మూవీని త్వరగా ఫినిష్ చేసి త్వరలోనే కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ కాంబోలో రాబోతోన్న అంటే సుందరానికీ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wbnZPG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...