Thursday, 1 July 2021

అలాంటి వారు పక్కన నిల్చున్నా కూడా ఇష్టం ఉండదు.. అసలు విషయం చెప్పిన రష్మిక

సోషల్ మీడియాలో చేసే సందడికి అందరూ ఫిదా అవుతుంటారు. ఆమె పెట్టే క్యూట్ ఫోటోలకు నెటిజన్లు పడిపోతుంటారు. ఇక ఆమె చేసే అల్లరికి భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉంటుంది. రష్మిక మందన్నా తన అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో రోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటారు. లేదా నెలకు ఒకసారైనా తన అభిమానులతో సోషల్ మీడియాలో చాట్ చేస్తుంటారు. గత నెలలో రష్మిక మందన్నా తన అభిమానుల కోసం లైవ్‌లోకి వచ్చారు. చాలా బిజీగా ఉండటం వల్ల ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండలేకపోతోన్నాను.. అందుకే ఎక్కువగా పోస్ట్‌లు చేయడం లేదంటూ తన అభిమానులకు రష్మిక సర్ది చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కరోనా రాకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి తన అభిమానులను సురక్షితంగా ఉండాలని కోరారు. ఇక ఆ లైవ్ సెషన్‌లో అభిమానులు అడిగిన వాటిని సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా రష్మిక మళ్లీ అలాంటి ఓ సెషన్‌ను పెట్టేశారు. ఏదైనా అడగండి అంటూ రష్మిక తన ఫాలోవర్లకు బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఇక నెటిజన్లు తమ ప్రతిభను చూపెట్టారు. ఇదే సమయం అనుకుని రష్మిక పర్సనల్ విషయాలను కూడా టచ్ చేశారు. పెళ్లి చేసుకుంటారా? పెళ్లిపై అభిప్రాయం ఏంటి? ఎలాంటి వాడు కావాలి? వంటి ప్రశ్నలు ఎదురవ్వగా రష్మిక ఆన్సర్‌లు ఇచ్చారు. అయితే ఓ నెటిజన్ మాత్రం సిగరెట్ తాగే అలవాటు గురించి అడిగారు. మీరు ఎన్నిసార్లు స్మోక్ చేశారు? అని రష్మికను అడిగితే అసలు విషయం చెప్పారు. తనకు స్మోకింగ్ అంటే అస్సలు నచ్చదని, ఎవరైనా స్మోక్ చేస్తుంటే వారు నా పక్కన నిల్చున్నా నాకు నచ్చదంటూ అసలు విషయాన్ని బయటపెట్టేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/368yAjU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...