Thursday, 1 July 2021

నివేధా థామస్ టాలెంట్‌కి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని హీరోగా నటించి ‘జెంటిల్‌మెన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ . తొలి సినిమాలోనే తన నటనతో ఆమె ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ‘నిన్ను కోరి’, ‘జై లవకుశ’, ‘118’, ‘బ్రోచేవారెవరురా’ అనే సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది నివేధా. ఇక తాజాగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించి ‘వకీల్ సాబ్’ చిత్రంలో పల్లవి పాత్రలో నటించిన నివేధాకు మంచి గుర్తింపు లభించింది. అంతకు ముందు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ సినిమాతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది ఈ కేరళ భామ. ఇక సినిమాలతో పాటు నివేధా సోషల్‌మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంది. ఇదిలా ఉండగా, తాజాగా గిటార్‌ వాయిస్తూ తన సింగింగ్‌ టాలెంట్‌ను కూడా బయటపెట్టేసింది. 2008లో విడుద‌లైన “జానే తు యా జానేనా” అనే సూపర్‌ హిట్‌ మూవీలోని కభీ కభీ అధితీ జిందగీ అనే పాటను పాడుతూ తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిన్లను ఆకట్టుకుంది. పాటలో ఆమె లీనమైన తీరు చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక నెటిజన్లు నివేధా టాలెంట్ చూసి ఫిదా అవుతున్నారు. మీలో ఈ టాలెంట్‌ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుధీర్‌ వర్మ డైరెక్షన్‌లో ‘శాకిని ఢాకిని’ అనే మూవీలో నటిస్తుంది. ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ అనే కొరియన్‌ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్ర మరొక హీరోయిన్‌గా నటిస్తుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xbyZhw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...