Saturday, 24 July 2021

KTR రియల్ ‘జాతిరత్నం’.. నవీన్ పోలిశెట్టి ట్వీట్‌‌పై దారుణమైన ట్రోలింగ్.. ఓ రేంజ్‌లో ఆడేస్తున్నారు

స్క్రీన్ రైటర్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. చిన్న చిన్న పాత్రల చేస్తూ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో నటుడిగా నిదొక్కున్నాడు. ఇక ‘జాతి రత్నం’ చిత్రంతో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంలోని మేనరిజంతో థియేటర్స్‌లో ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేట్టు చేశాడు. ఇతనో జాతిరత్నం అనేట్టుగానే అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చి.. భారీ స్థాయిలో ఫాలోయింగ్ రాబట్టాడు. ఇంతటి క్రేజ్ దక్కించుకున్న నవీన్ పోలిశెట్టి.. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ట్వీట్ చేసి దారుణంగా ట్రోల్ అవుతున్నాడు. నేడు (జూలై 24) కేటీఆర్ బర్త్ డే కావడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నవీన్ పోలిశెట్టి కూడా ట్విట్టర్ వేదికగా.. కేటీఆర్‌‌కి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే రియల్ తెలంగాణ జాతి రత్నం కేటీఆర్ గారు.. కరోనా సమయంలో మీరు చేసిన సహాయాల గురించి ఎన్నో వార్తలను చదివాను. థ్యాంక్యూ సార్. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలి’ అంటూ ట్వీట్ చేసి.. కేటీఆర్‌ని ట్యాగ్ చేశాడు. అయితే కేటీఆర్‌ని జాతిరత్నం అని పోల్చడంతో పాటు తెగ పొగిడేయంతో నవీన్ పోలిశెట్టి ట్వీట్‌పై ఘాటుగా రియాక్ట్ అవుతూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఒక్క రోజు అయినా హాస్పటల్స్ బిల్స్ గురించి అడిగావా?? హెల్ప్ చేసిన వాళ్లకంటే 1000 రెట్లు బిల్స్ కట్టలేక చనిపోయిన వాళ్లు ఉన్నారు.. ఇలా బూట్లు నాకొద్దు ప్లీజ్.. అని ఒకరంటే... ఆపరా బాబూ ఈ డబ్బా కొట్టడం అని మరొకరు.. ఇంకా జాతిరత్నం ప్రమోషన్స్ నుంచి బయటకు రాలేదా బాబూ అని ఆడుకుంటున్నారు. అయితే ట్రోల్ చేసేవారే కాదు.. నవీన్‌కి మద్దతు నిలిచినవారూ ఉన్నారు. నవీన్ పోలిశెట్టిని ట్రోల్ చేస్తున్న మీలాంటి వాళ్లని చూసినప్పుడు జాలిగా ఉంటుంది బ్రో.. ఏమీ చేయలేక పాపం బర్త్ డే విషెష్ చెప్పిన వాళ్లని టార్గెట్ చేస్తున్నారు’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TDpRUs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...