Saturday, 24 July 2021

ప్రభాస్ సలార్ చిత్రంలో ఊహించని మార్పులు.. తాజాగా అది యాడ్ చేశారట..

ఒక సినిమా జీవితాన్ని మార్చేస్తుంది అనడం హీరో విషయంలో అక్షరాల నిజమైంది. ‘బాహుబలి’ అనే సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రభాస్. అంతకు ముందు ప్రభాస్‌కి ఉన్న క్రేజ్ వేరు.. ఆ సినిమా తర్వాత ప్రభాస్‌కి వచ్చిన క్రేజ్ వేరే. ఆ సినిమా తర్వాత దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’, ‘ఆది పురుష్’, ‘’ తదితర పాన్ ఇండియా సినిమాల్లో అతను నటిస్తున్నాడు. తాజాగా గురుపౌర్ణమి సందర్భంగా ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా అధికారికంగా ప్రారంభం అయింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని.. ప్రభాస్ స్వయంగా క్లాప్ కొట్టి ప్రారంభించారు. అయితే ఇప్పుడు తన మరొక పాన్ ఇండియా సినిమా ‘సలార్‌’ సంబంధించి ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కేజీఎఫ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సిరీస్ తర్వాత దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ముందు అనుకున్న ప్రకారం కాకుండా ఈ సినిమాలో ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ని యాడ్ చేశారని తెలుస్తోంది. అంతేకాక.. ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ కూడా చేయిస్తున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. మరి వీటన్నిటి గురించి క్లారిటీ రావాలంటే.. సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UJ63PY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...