Friday, 23 July 2021

HBD Suriya : సూర్య మెచ్చిన కొరియోగ్రఫర్.. కోలీవుడ్‌లో జానీ మాస్టర్ జోరు!

బుట్టబొమ్మ పాటతో క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బుట్టబొమ్మకు ఆదరణ దక్కింది. అలా ఆ పాటకు కొరియోగ్రఫీ చేయడంతో జానీ మాస్టర్ పేరు కూడా మార్మోగిపోయింది. బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి జానీ మాస్టర్‌కు పిలుపు వస్తోంది. ఇప్పటికే భారీ ప్రాజెక్ట్‌లకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు జానీ మాస్టర్ కోలీవుడ్‌లో హాట్ ఫేవరేట్ అవుతున్నారు. ఇప్పటికే దళపతి 65వ సినిమాకు కొరియోగ్రఫర్‌గా ఫిక్స్ అయ్యారు. విజయ్ బీస్ట్ సినిమాకు అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మధ్యే రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్ట్‌లోనూ జానీ మాస్టర్ సెలెక్ట్ అయ్యారు. ఇలా ఇప్పుడు టాప్ ప్రాజెక్ట్‌లన్నీ కూడా జానీ మాస్టర్ ఖాతాలోనే పడుతున్నాయి. అలాంటి జానీ మాస్టర్‌ ఇప్పుడు 40వ ప్రాజెక్ట్‌లోనూ భాగస్వామి అయ్యారట. ఈ మేరకు నేడు సూర్య బర్త్ డే కావడంతో.. జానీ మాస్టర్ స్పెషల్ విషెస్ అందించారు. సూర్య 40కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అలాంటి సూర్య సినిమాకు తాను కొరియోగ్రఫీ అందించడం చాలా సంతోషంగా ఉందని జానీ మాస్టర్ అన్నారు. సూర్య మాస్ హీరో అని వారి ఫ్యాన్స్‌కి తెలుసు.. కానీ ఆయన ఎంతో మంచి మనిషి కూడా. ఎంతో ఒదిగి ఉంటారు.. సుతి మెత్తని వారు. సూర్య 40కి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనకు నా పనితనం నచ్చుతుందనే విషయం నాకు తెలిసినప్పుడు ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాను అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hWtkXu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...