Friday, 23 July 2021

ఎక్కడా తగ్గని ఆలియా భట్.. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌ కోసం నిర్విరామంగా..

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన నటి ఆలియా భట్. తొలి సినిమాలోనే బికినీ వేసి.. వీక్షకులకు అందాల విందు ఇచ్చింది. అయితే కేవలం అందాల ఆరబోత కాదు.. మంచి నటనతో కూడా ఆమె అభిమానులను అలరిస్తూ వస్తోంది. గ్లామరస్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా కంటెంట్ ఉన్న పాత్రలు కూడా చేస్తూ తన సత్తా నిరూపించుకుంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా ఉంది ఎవరంటూ ముందుగా అంతా పేరే చెబుతారు. దాదాపు సంవత్సరం క్రితం ‘సడక్ 2’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. ప్రస్తుతం ‘గంగూభాయ్ కతియావాడి’ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో అల్లురి సీతరామరాజుగా నటిస్తున్న సరసన హీరోయిన్‌గా ‘సీత’ అనే పాత్ర పోషిస్తోంది ఆలియా. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్. తాజాగా విడుదలైన ‘రోర్ ఆఫ్ ’లో ఆలియా లక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకూ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌లకు కొంతకాలం అంతరాయం ఏర్పడింది. ఎక్కడ చూసిన వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు కనిపిస్తుండటంతో.. షూటింగ్‌లను నిలిపివేశారు. ప్రస్తుతం కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో.. మళ్లీ షూటింగ్‌లను యధావిధిగా ప్రారంభించారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ తిరిగి ప్రారంభం కాగానే ఆలియా ఇందులో యాక్టివ్‌గా పాల్గొంటుంది. ఇందుకు సంబంధించి ఆర్ఆర్ఆర్ టీమ్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ పోస్ట్ చేసింది. సినిమా షూటింగ్‌ జరుగుతున్న వేగం చూస్తే.. ఈసారి చెప్పిన తేదీకి కరెక్ట్‌గా విడుదల చేస్తారనే భావన అందరిలో కలుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y4nSY7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...