Friday, 23 July 2021

‘మిమల్ని చాలా మిస్ అవుతున్నాను’.. సోనూసూద్ భావోద్వేగ ట్వీట్

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మందికి త‌న వంతు సాయమందిస్తూ రియ‌ల్‌ హీరో అయిపోయారు నటుడు సోనూసూద్. ఎవరు ఏ సాయం కావాలని అడిగినా వెంటనే నేనున్నానంటూ వారికి భరోసా కల్పిస్తున్నారు. ప్రతిరోజూ వేలమంది సోషల్‌ మీడియా వేదికగా ఆయన్ను సాయం కోసం ఆశ్రయిస్తున్నారు. మరికొందరు వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసిన మరీ ఇంటి వద్ద ఆయన్ని కలుసుకొని.. తమ కష్టాలను తీర్చాలని కోరుకుంటున్నారు. సహాయం అడిగిన ప్రతీ ఒక్కరికి సహాయం చేసేలా చర్యలు చేపడుతున్నారు సోనూ. సోషల్‌మీడియాలో ఎవరు సహాయం కోరినా.. చేయూత అందిస్తున్నారు సోనూసూద్. ముఖ్యంగా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, ఐసీయూలో బెడ్లు అందించడంలో ఆయన తీవ్రంగా కృషి చేశారు. అంతేకాదు.. దేశంలో ఎవరికీ ఆక్సిజన్ కొరత ఉండకూడదనే ఉద్దేశ్యంతో స్వయంగా తన ఫౌండేషన్ తరఫున ఆక్సిజన్ ప్లాంటులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ ప్లాంటులు ఏర్పాటు చేసేందుకు సోసూ ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా ఆయన తన జీవితంలో ఓ ముఖ్యమైన వ్యక్తిని గుర్తు చేసుకున్నారు. ఆమె మరెవరో కాదు.. సోనూసూద్ తల్లి. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ట్వీట్ చేసిన సోనూసూద్.. ఈ విషయాన్ని ఆమెను స్వయంగా కలిసి చెప్పాలని ఉందంటూ వేదన వ్యక్తం చేశారు. ‘‘మీరు నాకు నేర్పించిన జీవిత పాఠాలకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నానో చెప్పడానికి ఈ మెసేజ్‌లు సరిపోవు. మీరు లేకుండా నా జీవితంలో ఏర్పడిన శూన్యం నేను మిమ్మల్ని మళ్లీ చూసేవరకు ఎప్పుడూ అలాగే ఉంటుంది. నాకు మీరు ఎప్పుడు ఇలాగే మార్గనిర్ధేశం చేయాలి. మీరు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eN1c7b
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...