Friday, 23 July 2021

‘నువ్వు రాక్‌స్టార్‌వి కానీ.. మాన్‌స్టర్‌ల ప్రవర్తిస్తున్నావు’.. ‘ఆకాశవీధుల్లో’ టీజర్ విడుదల

గౌతమ్ కృష్ణ, జంటగా జీకే ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టీజర్ చూస్తే.. దాదాపుగా అర్జున్ రెడ్డి సినిమా టీజర్ గుర్తుకు వస్తుంది. హీరో ప్రవర్తించే విధానం సినిమా కాన్సెప్ట్‌ చూస్తే బ్లాక్‌బస్టర్ హిందీ సినిమా ‘ఆషికి-2’ రీమేక్ ఇదా అని అనిపిస్తుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టకుంటుంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఒక కథను తెరపైకి ఎక్కించే క్రమంలో దర్శకుడు అన్ని విధాలుగా రెస్పాన్స్ తీసుకోవాలి, పైగా చెప్పే కథలో ఎక్కడ ఇంటెన్షన్ తగ్గకూడదని నేనే దర్శకత్వం వహిస్తున్నాను. . సినిమా అంటే నాకు ప్యాషన్, అందుకే నేనే దగ్గరుండి చేస్తున్నాను. హార్ట్ బ్రేక్ అయిన వ్యక్తి గురించి చెప్పే కథ ఇది. చాలా నమ్మకంతో ఉన్నాం ..మా ప్రయత్నాన్ని అందరు ఆశీర్వదించాలి’ అని అన్నారు . ఇక దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ట్రైలర్ చూశాక నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కొత్త దర్శకుడైనా కూడా మొదటి సినిమాకే ఇంత బాగా తీసాడంటే అతనిలో ఎంత తపన ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రైలర్ చూసి ఈ టీమ్ ను అబినందించాలనే ఈ వేడుకకు వచ్చాను’ అని ఆయన పేర్కొన్నారు. హీరోయిన్ పూజిత మాట్లాడుతూ.. టీజర్ చాలా అద్భుతంగా ఉంది.. కొత్త దర్శకుడు అయినా.. గౌతమ్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు అని పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/370kG3G
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...