Wednesday, 28 July 2021

Hanuma Vihari : పవన్ కళ్యాణ్‌ క్రేజ్‌కు నిదర్శనం.. భీమ్లా నాయక్‌పై ఇండియన్ క్రికెటర్ కామెంట్

పవర్ స్టార్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ప్రతీ రంగంలోనూ అభిమానులున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మంది అభిమానులున్న ఆయనకు ఇండియన్ క్రికెట్ టీంలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ముందుంటారు. ఆయనకు తన హీరో మీదున్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటి చెబుతుంటారు. అంతే కాకుండా హనుమ విహారి ఎప్పుడూ కూడా సామాజిక సేవ అంటూ ఎన్నో మంచి పనులు చేస్తుంటారు. సినీ రంగంపైనా ఆయన ఓ కన్ను వేసి ఉంచుతారు. ఆ మధ్య బిగ్ బాస్ షో మీద, అభిజిత్ మీదా కామెంట్ చేశారు. కరోనా సమయంలోనూ ఎంతో మందికి సాయం మందించారు. ఇలా ఈ కుర్ర క్రికెటర్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో ఉంటారు. కాకినాడకు చెందిన హనుమ విహారి ఇది వరకు పవన్ కల్యాణ్‌తో దిగిన ఫోటోలనుషేర్ చేయగా అది తెగ వైరల్ అయింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లను ఆడబోతోన్నాడతను. తొలి టెస్ట్ వచ్చేనెల 4వ తేదీన నాటింగ్‌హామ్‌లో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ప్రస్తుతం జట్టుతో పాటు అక్కడే ఉంటోన్నాడు. అలా ఇంగ్లండ్‌లో ఉన్నా కూడా తన అభిమానాన్ని చాటుకున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ రానా మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను వదిలారు. ఇందులో పాత్రలో పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతోన్నాడో చూపించారు. అంతేకాకుండా వచ్చే సంక్రాంతికి థియేటర్లో రాబోతోన్నట్టు ప్రకటించేశారు. ఈ అప్డేట్ చూసిన హనుమ విహారి ఎగిరి గంతేసినట్టున్నారు. ఈ మేరకు ఆయన వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. భీమ్లా నాయక్ ఆన్ ఫైర్ అన్నట్టుగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం హనుమ విహారి వేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3x968ti
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...