Wednesday, 28 July 2021

సినీజంట విడాకుల వ్యవహారం.. గృహహింస కాదు కానీ.. నోరు విప్పిన దేవిక

సినీ ప్రపంచంలో ప్రేమలు,పెళ్లిళ్లు ఎంత సహజమో బ్రేకప్పులు, విడాకులు కూడా అంతే సహజం. ఎప్పుడు ఎవరు ప్రేమించుకుంటారు.. ఎవరు విడాకులు తీసుకుంటారో చెప్పడం కష్టం. తాజాగా మాలీవుడ్‌లోని జంట వ్యవహారం విడాకుల వరకు వెళ్లింది. నటుడు, ఎమ్మెల్యే అయిన మెతిల్ దేవికల వ్యవహారం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికి 2013లో వివాహాం జరిగింది. మొదట్లో ఈ ఇద్దరూ కూడా కేరళ లలితా కళా అకాడమీలో పని చేశారు. ముఖేష్ మొదటి భార్య సరితతో 2011లో విడాకుల అనంతరం దేవికను వివాహాం చేసుకున్నారు. అసభ్యకరంగా దూషించడం, గృహహింస వంటి కారణాలతో ముఖేష్ నుంచి తాను దూరమైనట్టు సరిత చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కూడా దేవిక ఇంచు మించు ఇలాంటి కారణాలతో విడాకులు కోరుతున్నట్టు తెలుస్తోంది. గృహహింస కారణంగానే విడాకులు కోరుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై దేవికా స్పందించారు. గృహ హింస అనేది భిన్న రూపాల్లో ఉంటుంది.. ఇప్పుడు నేనేం చెప్పలేకపోతోన్నాను. నాకు కరోనా వచ్చిన సమయంలోనూ ఆయన నన్ను పట్టించుకోలేదు.. నా గురించి ఆలోచించలేదు. ఇది నా వ్యక్తిగత సమస్య. నా పర్సనల్ ప్రాబ్లంలతోనే విడాకులు కోరుతున్నాను అని దేవికా చెప్పుకొచ్చారు. మొత్తానికి వీరి విడాకుల వ్యవహారం మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VijI0p
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...