Sunday, 11 July 2021

కష్టకాలమైనా తగ్గని సేవాభావం.. బుర్రిపాలెంపై మరోసారి ప్రేమను చాటుకున్న మహేష్

రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌ హీరో అనిపించుకుంటున్నారు సూపర్ స్టార్ . ఆయన సహాయం చేసే విధానం వేరు. ప్రతీ విషయంపై రియాక్ట్ కాని ఆయన ఎవరైనా చిన్నారులకు గుండె సంబంధిత వ్యాధి ఉందంటే.. నేనున్నాను అంటూ ముందుకు కదలి వస్తారు. ఇప్పటికే కొన్ని వందలమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ ప్రాణం నిలుపుతున్నారు ఈ రియల్ హీరో.. అంతేకాదు.. తన స్వగ్రామం బుర్రిపాలెంని దత్తత తీసుకుని అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం తన తండ్రి కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని.. ఆయన బుర్రిపాలెంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. వ్యాక్సిన్ తీసుకొనేందుక భయపడుతున్న గ్రామస్థుల్లో అవగాహన కల్పించి.. ప్రతీ ఒక్కరుకి ఆయన వ్యాక్సినేషన్ ఇప్పించారు. ఇప్పుడు మరోసారి మహేశ్ తన సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తొలి వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఆయన రెండో డోస్ వ్యాక్సినేషన్ ఇప్పించడం ప్రారంభించారు. ఆంధ్ర హాస్పిటల్స్ సహాయంలో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని నడిపిన్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు సేవా నిరతిని మెచ్చుకుంటూ.. నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ బాబు ‘గీతా గోవింతం’ ఫేమ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ATGuM8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...